Joe Root Century Tribute to Graham Thorpe | సెంచరీతో గ్రాహమ్ థోర్ప్ కి ట్రిబ్యూట్ | ABP Desam
భారత్ నిర్దేశించిన 384పరుగుల టార్గెట్ ను ఛేజ్ చేసేందుకు పోరాడుతోంది ఇంగ్లండ్. ప్రత్యేకించి సూపర్ ఫామ్ లో ఉన్న జో రూట్ తన టెస్ట్ కెరీర్ లో 39వ సెంచరీని బాదేశాడు. గడచిన ఐదేళ్లలో 22సెంచరీ అతనికి. హ్యారీ బ్రూక్ తో కలిసి ధనా ధన్ ఇన్నింగ్స్ ఆడిన రూట్ ఇంగ్లండ్ ను ఇప్పుడు ఆల్మోస్ట్ టెస్ట్ మ్యాచ్ గెలిచే స్టేజ్ కు తీసుకువచ్చేశాడు. ఐదో రోజు ఇంగ్లండ్ ఆటగాళ్లు 35పరుగులు చేస్తే చాలు విజయం వాళ్లదే. అయితే నాలుగో రోజు సెంచరీ చేసిన తర్వాత జో రూట్ ఓ సెలబ్రేషన్ చేశాడు. బ్యాట్ ఎత్తి సెంచరీ అభివాదం చేసిన తర్వాత తన ప్యాంట్ జేబులో నుంచి ఓ హెడ్ బ్యాండ్ తీసి తలకు పెట్టుకున్నాడు. ఎలా ఎందుకు చేశాడంటే జో రూట్ ఇంగ్లండ్ మాజీ ఆటగాడు గ్రాహమ్ థోర్ప్ కి ట్రిబ్యూట్ ఇచ్చాడు. ఇంగ్లండ్ మాజీ ఆటగాడైన గ్రాహం థోర్ప్ గతేడాది చనిపోయాడు. అయితే థోర్ప్ మరణానికి కారణం బలవన్మరణానికి పాల్పడటం. సివియర్ ఎంగ్జైటీ, మెంటల్ ఇల్ నెస్ తో తన జీవిత చరమాంకంలో బాధపడిన గ్రాహం గతేడాది ఓ ట్రైన్ నుంచి దూకేసి ప్రాణాలు తీసుకున్నాడు. కానీ ఇంగ్లండ్ కి ఆడుతున్నప్పుడు తనో స్టైలిష్ బ్యాటర్. హెడ్ బ్యాండ్ తలకు పెట్టుకుని 4or5 ప్లేస్ లో బ్యాటింగ్ దిగి డిస్ట్రక్షన్ అంటే ఏంటో చూపించేవాడు గ్రాహమ్ థోర్ప్...ఇంగ్లండ్ కు వంద టెస్టులు ఆడిన అతి కొద్ది ఆటగాళ్లలో ఒకడైన గ్రాహమ్ థోర్ప్ పేరిట 17 టెస్ట్ సెంచరీలు ఉన్నాయి. రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లండ్ కు కోచ్ గానూ వ్యవహరించిన థోర్ప్ సర్రీ కౌంటీ తో ప్రత్యేక అనుబంధాన్ని కొనసాగించాడు. అలాంటి ఆటగాడు మెంటల్ ఇల్ నెస్ తో చనిపోవటాన్ని తట్టుకోలేకపోయిన అతని కుటుంబం ఏటా ఓ టెస్ట్ మ్యాచ్ ను గ్రాహమ్ థోర్ప్ టెస్ట్ గా నిర్వహించాలని ఈసీబీని రిక్వెస్ట్ చేసింది. మానసిక ఆరోగ్యంపై అవగాహనే లక్ష్యంగా సాగే ఈ టెస్ట్ లో ఆటగాళ్లంతా హెడ్ బ్యాండ్స్ థరించి థోర్ప్ ను గుర్తు చేసుకున్నారు. మన బౌలర్ సిరాజ్ మియా కూడా హెడ్ బ్యాండ్ పెట్టుకుని థోర్ప్ కి ట్రిబ్యూట్ ఇచ్చాడు ఇదే టెస్టులో.





















