Womens World Cup లో Australia తో జరిగిన League Match లో భారత మహిళలు ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా... ఆరంభంలోనే భారత్ ను దెబ్బతీసింది. 28 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో Yasthika Bhatia తో జత కలిసిన Captain Mithali Raj 130 పరుగుల Partnership తో జట్టు Innings ని కాస్త గాడిన పెట్టింది. చివర్లో Harmanpreet Kaur, Pooja Vastrakar మెరుపులతో భారత్ 277 పరుగులు సాధించింది. ఛేజింగ్ ప్రారంభించిన ఆసీస్.. చాలా పాజిటివ్ గా బ్యాటింగ్ చేసింది. ఎక్కడా తడబడలేదు. 121 పరుగుల తొలి వికెట్ పార్టనర్ షిప్ నెలకొల్పారు. కెప్టెన్ Meg Lanning 97 పరుగులతో ఆకట్టుకోగా, Alyssa Healy, Rachel Haynes రాణించారు. మధ్యలో వర్షం అడ్డంకి వచ్చి మ్యాచ్ రీస్టార్ట్ అయ్యాక భారత బౌలర్లు పుంజుకున్నట్టే కనిపించారు. కాస్త Pressure పెట్టి మ్యాచ్ ను ఆఖరు దాకా తీసుకొచ్చారు. కానీ మరో 3 బంతులు ఉండగానే ఆసీస్ మ్యాచ్ కైవసం చేసుకుంది. Batting కు చాలా అనువుగా ఉన్న వికెట్ పై భారత్ కనీసం 30 పరుగులు అయినా తక్కువ చేయడం వల్లే మ్యాచ్ ను గెలుచుకోలేకపోయిందని స్పష్టమవుతోంది. ఈ మ్యాచ్ తర్వాత 4 పాయింట్లతో భారత్ నాలుగో స్థానంలో ఉంది. Bangladesh, South Africa తో జరగబోయే తర్వాతి మ్యాచ్ లను గెలిస్తే Semifinals అవకాశాలు మెరుగవుతాయి.
India's Squad For SA&England: టీ20 కెప్టెన్ గా కేఎల్ రాహుల్|ABP Desam
Sudarsan Pattnaik Symonds Sand art: సైమండ్స్ కు ఘననివాళి అర్పించిన సుదర్శన్ పట్నాయక్|ABP Desam
Cricketers who passed away at young age:చిన్న వయస్సులోనే కన్నుమూసిన క్రికెటర్లు|ABP Desam
Australia Cricketer Andrew Symonds passes Away:ఆసీస్ మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ మృతి|ABP Desam
Ambati Rayudu not Retiring from IPL| అంబటి రాయుడు రిటైర్ కావడం లేదని తెలిపిన CSK CEO| @ABP Desam
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి
Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Samudram Chittabbai: చక్కని విలేజ్ ప్రేమ కథ ‘సముద్రం చిట్టబ్బాయి’, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
Income Earners: నెలకు రూ.25వేలు జీతమా! కంగ్రాట్స్ - ఇండియా టాప్-10లో ఉన్నట్టే!