Ind vs USA Match preview | నేడు USA తో టీమిండియా టీ20 మ్యాచ్ | T20 World Cup 2024
టీ20 వరల్డ్ కప్ 2024లో సూపర్ 8కి అర్హత సాధించాలని తహతహలాడుతున్న భారత్ కు ఈ రోజు USA తో మ్యాచ్. పాకిస్థాన్ మీద ఉత్కంఠభరితమైన విజయం సాధించిన టీమిండియా..ఈ వరల్డ్ కప్ లో ఇప్పటికే పాకిస్థాన్ కు షాక్ ఇచ్చిన అమెరికాతో ఈ రోజు మ్యాచ్ ఆడనుంది. మరి ఈ మ్యాచ్ ప్రివ్యూ ఏంటో ఈ వీడియో చూద్దాం. ముందు టీమిండియా బ్యాటింగ్ ఆందోళనకరంగా ఉంది. ఓపెనర్లు రోహిత్, కొహ్లీ సరైన పార్టనర్ షిప్ ను ఐర్లాండ్, పాకిస్థాన్ మీద నమోదు చేయలేకపోయారు. ఇక టాప్ ఆర్డర్ లో పంత్ తప్ప మిగిలిన బ్యాటర్ల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. వరుసగా USA,కెనడాలతో మ్యాచ్ లు కాబట్టి సూర్యకుమార్ యాదవ్, దూబే మంచిగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసి సూపర్ 8 కి సిద్ధం కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బౌలింగ్ విభాగం మాత్రం మెరుగ్గా కనిపిస్తోంది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో రాణిస్తుండటం మంచి విషయం. స్పిన్నర్లు అక్షర్ పటేల్, జడ్డూ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ రాణించాలని డ్రెస్సింగ్ రూమ్ కోరుకుంటోంది.బుమ్రా అయితే దేవుడిలా ఆదుకుని మ్యాచులు గెలిపిస్తున్నాడు. సిరాజ్, అర్ష్ దీప్ సింగ్ రాణిస్తే అది బోనస్సే. మరోవైపు అమెరికా పేరుకు అమెరికా అనే జట్టే అయినా అందులో చాలామంది భారత సంతతి ఆటగాళ్లే. ఉద్యోగాల కోసమో, సెటిల్ అవ్వటానికో అమెరికా వెళ్లిన మన క్రికెటర్లంతా ఇప్పుడు ఆ టీమ్ తరపున ఆడేస్తున్నారు. భారత సంతతి ఆటగాళ్లయిన కెప్టెన్ మోనాంక్ పటేల్‌తోపాటు బౌలర్లు సౌరభ్ నేత్రావాల్కర్, హర్మిత్‌సింగ్, జస్‌దీప్ సింగ్, నితీశ్‌కుమార్‌తో వీళ్లతో టీమ్‌ఇండియా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే వీళ్లే పాకిస్థాన్ కు షాక్ ఇచ్చారు.పాకిస్థాన్‌పై మోనాంక్ పటేల్ హాఫ్ సెంచరీ కొట్టేశాడు. ఇక ఆ జట్టులోని ఆరోన్ జోన్స్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. కెనడాపై 94 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరో బ్యాటర్ ఆంద్రీస్ గౌస్ ఇదే మ్యాచ్‌లో ఫిఫ్టీ కొట్టాడు. సో టీమిండియా జాగ్రత్తగా వీళ్లను ఆడుకోకుంటే ఈ గ్రూపులో మరో షాక్ తప్పదు.