Ind vs NZ Second Test Day 3 Highlights | మూడోరోజుల్లో భారత్ కథ ముగించేసిన న్యూజిలాండ్ | ABP Desam
పుష్కర కాలం అంటే పన్నెండేళ్లు. 18 సిరీస్ ల ఘన విజయాల పరంపర తర్వాత 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా హోం గ్రౌండ్ లో టెస్ట్ సిరీస్ ను కోల్పోయింది. కివీస్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచులోనూ భారత్ రాత మారలేదు. ఈ సారి మూడు రోజుల్లోనే భారత్ కథ ముగిసిపోయింది. 359 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్ లో 245 పరుగుల కు ఆలౌట్ అయ్యింది. యశస్వి జైశ్వాల్ 77పరుగులు చేయటం మినహా మరో గొప్ప ఇన్నింగ్స్ కనపడలేదు భారత బ్యాటర్ల నుంచి. చివర్లో రవీంద్ర జడేజా 42పరుగుల పోరాటం భారత్ కు కాపాడ లేకపోయింది. తొలి ఇన్నింగ్స్ లో న్యూజి లాండ్ 259 పరుగులకు ఆలౌట్ కాగా భారత్ 156 పరుగులకే కుప్పకూలిపోయింది. రెండో ఇన్నింగ్స్ లో రెండో రోజు 5వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసిన న్యూజిలాండ్ ఓవర్ నైట్ స్కోరుకు మరో 57పరుగులు జోడించి ఆలౌట్ అయిపోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో తేలిపోయినా 359 పరుగుల టార్గెట్ ను భారత్ ఛేజ్ చేయటానికి ట్రై చేసినట్లు ఇంటెంట్ కనిపించినా కివీస్ బౌలర్లు వరుస విరామాల్లో తీయటం..మన వాళ్ల చెత్తషాట్లు, అనవసర రనౌట్లతో ఈరోజే భారత్ కథ ముగిసిపోయింది. ఫలితంగా 0-2 తేడాతో తొలిసారి ఇండియాలో టెస్ట్ సిరీస్ ను కైవసం చేసుకున్న న్యూజిలాండ్ 12ఏళ్ల తర్వాత భారత్ లో భారత్ కు టెస్టు సిరీస్ ఓటమిని రుచిచూపించింది.