Gautam Gambhir New Strategy | సరికొత్త స్ట్రాటజీ, ఆంక్షలతో ఇకపై టీమిండియా క్రికెట్ | ABP Desam
ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ ను 2-2తో డ్రా చేసిన తర్వాత యంగ్ ఇండియా పై ప్రపంచం వ్యాప్తంగా ప్రశంసలు వెల్లు వెత్తుతున్నాయి. అదే సమయంలో భారత క్రికెట్ ను సరికొత్త మార్గం వైపు నడిపిస్తానంటున్నాడు టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్. అదేంటంటే పర్సన్ సెంట్రిక్ క్రికెట్ కు ఇక కాలం చెల్లింది అని చెబుతున్నాడు. అంటే భారత క్రికెట్ లో స్టార్ సంస్కృతి కనపడకూడదని గంభీర్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. అంటే నార్మల్ క్రికెటర్ల కాకుండా ఫామ్ తో సంబంధం లేకుండా...బీసీసీఐ ను సైతం శాసించేంతంటి స్థాయి. సచిన్ శకం నుంచి మాట్లాడుకుంటే ధోనీ, కొహ్లీ, రోహిత్ శర్మ ఇప్పుడు బుమ్రా స్టార్ స్టేటస్ చూసిన ఆటగాళ్లు. వీళ్లకూ కెరీర్ చరమాంకంలో బీసీసీఐ నిర్ణయాలకు తలొగ్గక తప్పలేదు కానీ వాళ్లున్నంత కాలం క్రికెట్ మొత్తం వాళ్ల చుట్టే తిరిగేది. ఉదాహరణకు 2011 వరల్డ్ కప్ టీమిండియా గెలవటంలో జట్టు మొత్తం కీలక పాత్ర పోషించింది. కానీ వరల్డ్ కప్ గెలిచిన క్రెడిట్ గురించి మాట్లాడుకుంటే ధోని పేరే వినిపిస్తుంది. సిరీస్ ఆద్యంతం ఆడిన యువరాజ్ ను, ఫైనల్ ధోని కంటే ఎక్కువ పరుగులు కొట్టిన గంభీర్ ను, ఫైనల్లో వికెట్లు తీసిన జహీర్ ఖాన్ ను ఎవ్వరూ గుర్తు పెట్టుకోరు. ఇదే స్టార్ స్టేటస్ అనేది గంభీర్ వాదన. పర్సన్ సెంట్రిక్ గా ఓ వ్యక్తి చుట్టూనే క్రికెట్ తిరుగుతుండటం వల్ల మిగిలిన ఆటగాళ్లు ఆత్మన్యూనతకు లోనవుతున్నారని ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్న గంభీర్..ఇప్పుడు హెడ్ కోచ్ గా తన నిర్ణయాలను నిర్భయంగా బీసీసీఐ ముందు పెట్టాడు. ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ డ్రా అయ్యాక బీసీసీఐ అధికారులతో గంభీర్ చెప్పిన మాట ఇదేనట. ఇకపై ఆడితే జట్టుగా ఆడాలి. నో మోర్ స్టార్స్ అని. అంటే ఇది వరకటిలా ఆటగాళ్లకు తాము ఏం సిరీస్ లు ఆడాలో వద్దో సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారాలు లేవు. మొన్న ఇంగ్లండ్ సిరీస్ లో లా బుమ్రా తనకు నచ్చిన టెస్టులు నచ్చినప్పుడు మాత్రమే ఆడతాననే మినహాయింపులు ఉండవు. ప్రత్యేకించి పనిభారం అనే మాట వినపడకూడదని...జాతీయ జట్టుకు ఆడుతున్నప్పుడు...దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నప్పుడు అది గర్వంగా భావించాలని..పూర్తిగా ఫిట్ గా ఎలా ఉండాలి..గాయాలు కాకుండా ఎలా ఆడాలనేది సిరాజ్ లాంటి బౌలర్లను చూసి నేర్చుకోవాలని చెప్పాడట గంభీర్. చూడాలి మరి గంభీర్ చేస్తున్న ఈ మార్పులు టీమిండియాకు మేలు చేస్తాయా లేదా అని కాలమే నిర్ణయించాలి.



















