BCCI Serious on Team India Players | దులీప్ ట్రోఫీ ఆడమన్న ప్లేయర్లపై మండిపడిన బీసీసీఐ | ABP Desam
ఇన్నాళ్లూ టీమిండియా కు సెలెక్ట్ అయితే చాలు...సిరీస్ లకు చేసుకునే ప్రాక్టీస్ లు తప్ప వేరే మ్యాచ్ ప్రాక్టీస్ ఉండేది కాదు. దేశవాళీ టోర్నీలైన రంజీ, దులీప్ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీల్లో స్టార్ క్రికెటర్లు పాల్గొనేవాళ్లు కాదు. అదంతా సచిన్ తరంతోనే ముగిసిపోయింది. కానీ ఇప్పుడు బీసీసీఐ ఆ లీనియెన్స్ ఇవ్వటం మానేసింది. ఎంతటి స్టార్ క్రికెటరైనా సరే దేశవాళీలు ఆడాల్సిందనే రూల్ తెచ్చింది. అంతే కాదు ఫామ్ కారణంగానో..గాయం కారణంగానో టీమ్ లో స్థానం కోల్పోయాడా ఇకంతే దేశవాళీలు ఆడి ఫిట్ నెస్, ఫామ్ ను నిరూపించుకుంటేనే టీమిండియా సెలెక్షన్ కు కన్సిడర్ చేస్తోంది బీసీసీఐ. తాజాగా దులీప్ ట్రోఫీ కోసం టీమ్ అనౌన్స్మెంట్ జరిగింది. ఇంగ్లండ్ సిరీస్ లో అలిసిపోయిన కారణంగా కొంత మంది స్టార్ ఆటగాళ్లు రెస్ట్ కోరుకున్నారు. ఫలితంగా సౌత్ జోన్ తమ ప్లేయర్లు టీమ్ ఇండియాకు ఆడే క్రికెటర్లైన కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, సాయి సుదర్శన్ లేకుండానే టీమ్ ను అనౌన్స్ చేసింది. దీనిపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీసీసీఐ కాంట్రాక్టులో ఉన్నాడంటే బీసీసీఐ కి సంబంధించిన అన్ని టోర్నీలకు అందుబాటులో ఉంటారనే గ్రహించాలన్న బీసీసీఐ జనరల్ మేనేజర్ అబయ్ కురువిళ్ల ఈ మేరకు రాష్ట్ర సంఘాలకు ఈమెయిల్స్ పంపి స్టార్ క్రికెటర్లు అయినా సరే విరామ సమయాల్లో దేశవాళీ టోర్నీలు ఆడేలా చేయాలని ఆదేశాలు ఇచ్చారు.





















