లద్దాఖ్‌లో జన్‌స్కర్ వేడుకల సందడి, ఆకట్టుకున్న సంప్రదాయ నృత్యాలు
లద్దాఖ్‌లో జన్‌స్కర్ ఫెస్టివల్ సందడి మొదలైంది. జన్‌స్కర్ వ్యాలీలోని ప్రజలు ఈ వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ మారుమూల ప్రాంతంలో ఇంత గొప్ప సంస్కృతిని ఇంకా కొనసాగిస్తున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. ఈ పండుగ వచ్చిందంటే చాలు. వాళ్లలో ఎక్కడి లేని హుషారంతా వచ్చేస్తుంది. బోటో తెగకు చెందిన వీళ్లకు ఆ లోయ ప్రాంతమే ప్రపంచం. అక్కడి సంప్రదాయాలను, ఆచారాలను తుచ తప్పకుండా పాటిస్తారు. ఇందులో భాగంగానే ఈ జన్‌స్కార్ పండుగ చేసుకుంటారు. ఎన్నో శతాబ్దాలుగా ఇది వాళ్లకో ఆనవాయితీగా వస్తోంది. ఈ వేడుకల్లో హైలైట్ వాళ్ల వేషధారణే. ఉన్నితో చేసిన దుస్తులు, టోపీలు పెట్టుకుంటారు. మెడలో పూసల దండలు వేసుకుంటారు. కాళ్లు కూడా పూర్తిగా కవర్ అయ్యేలా ఉంటాయి వాళ్లు దుస్తులు. ఇక టోపీలపైన రకరాకల పూవులు పెట్టుకుంటారు. ఇక మహిళలు ధరించే దుస్తులూ ఇంతే అందంగా, ప్రత్యేకంగా ఉంటాయి. ఈ వేడుకల్లో భాగంగా అంతా కలిసి సంప్రదాయ వాద్యాలు వాయిస్తారు. రకరకాల మాస్క్‌లు పెట్టుకుంటారు. ఇక వాళ్లు వేసే సంప్రదాయ నృత్యాలూ ఆకట్టుకుంటాయి. కొమ్ములుంటే మాస్క్‌లు పెట్టుకుని...మ్యూజిక్‌కి అనుగుణంగా డ్యాన్స్‌లు చేస్తారు. వందల ఏళ్లుగా ఉన్న తమ సంస్కృతిని కాపాడుకునేందుకు ఈ వేడుకను ఓ వేదికగా భావిస్తారు స్థానికులు.