India vs China Water war | చైనా మెగా డ్యాంకి ఇండియా కౌంటర్ ప్లాన్ అదుర్స్ | ABP Desam
ఇండియా-చైనా బోర్డర్ అంటే మనందరికీ యుద్ధ ట్యాంకులు, మిలిటరీ బలగాలే గుర్తుకొస్తాయి. కానీ ఇప్పుడు వీటితో పాటు.. ఇంకో సైలెంట్ వార్ స్టార్ట్ చేసింది చైనా. అదే వాటర్ వార్. ఇప్పటివరకు తొపాకులు, విమానాలు, ట్యాంకులు, ఆర్మీతో ఇండియాపై దాడికి తెగబడిన చైనా.. వాటన్నింటితో ఏమీ చేయలేకపోతోందని అర్థం చేసుకుని.. ఇప్పుడు నీళ్లతో భారత్‌ని దెబ్బ కొట్టాలని ప్లాన్ చేసింది. ఒకవేళ ఈ ప్లాన్‌లో చైనా సక్సెస్ అయితే.. రాత్రికి రాత్రి భారతదేశ రూపు రేఖలని మార్చేయగలదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు భారత్‌ని తన ముందు మోకరిల్లేలా చేసుకోగలదు. అంతేకాదు.. చైనా ప్లాన్ సక్సెస్ అయితే భారత ఈశాన్య రాష్ట్రాలన్నీ మనుషులు జీవించలేని దుర్భర ప్రాంతాలుగా మారిపోతాయి. లక్షల మంది భారతీయులు నిరాశ్రయులవుతారు. వేల మంది ప్రాణాలు కోల్పోతారు. అందుకే వీటన్నింటినీ ఎదుర్కోవడానికి కేంద్రం ప్రభుత్వం ఓ అద్భుతమైన కౌంటర్ ప్లాన్ రెడీ చేసింది.
హాయ్.. అండ్ వెల్‌కమ్ టూ ఇండియా మాటర్స్. హిమాలయ శిఖరాలలో పుట్టి.. టిబెట్ పీఠభూమి గుండా ప్రవహిస్తూ.. భారత ఈశాన్య రాష్ట్రాలను సస్యశ్యామలం చేస్తూ.. బంగ్లాదేశ్ జీవనదిగా పేరుపొందిన నది బ్రహ్మపుత్ర నది. ఈ నదే ఇప్పుడు అణుశక్తి దేశాలైన భారత్, చైనా మధ్య ఒక ప్రమాదకరమైన యుద్ధానికి కేంద్రంగా మారింది. మనం బ్రహ్మపుత్రా నదిగా పిలిచే ఈ నదిని చైనీస్ ప్రజలు యార్లాంగ్ త్సాంగ్చో అని పిలుచుకుంటారు. ఈ నదిపైనే చైనా.. టిబెట్ ప్రాంతంలో.. ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ డ్యామ్ నిర్మిస్తోంది. అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దుల్లోని టిబెట్ భూభాగంలో ఈ మెగా ప్రాజెక్టు నిర్మించబోతోంది. ఈ మెగా ప్రాజెక్ట్‌ని 2030 నాటికి పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ పూర్తయితే, అది చైనాకు బ్రహ్మపుత్ర నదిపై కంప్లీట్ స్ట్రాటజికల్ డామినెన్స్ ఇస్తుంది. అందుకే ఈ ప్రాజెక్ట్ ఈశాన్య రాష్ట్రాలకు ఒక పెద్ద 'టైమ్ బాంబ్'లా మారింది. ఈ డ్యాం పూర్తి చేశాక చైనా.. ఎప్పుడైనా ఇండియాని ఇబ్బంది పెట్టాలనుకుంటే.. సడెన్‌గా ఈ డ్యామ్ గేట్లు తెరిస్తే చాలు.. అరుణాచల్ ప్రదేశ్, అసోం రాష్ట్రాలు ఊహించని భారీ వరదలతో అల్లకల్లోలం అవుతాయి. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులవుతారు, పంట పొలాలు నామరూపాలు లేకుండా కొట్టుకుపోతాయి. అలా కాకుండా.. ఒకవేళ వర్షాలు తక్కువగా ఉన్నప్పుడు.. చైనా నీటిని రిలీజ్ చేయకపోతే.. మన రాష్ట్రాలు భయంకరమైన కరువు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే, భవిష్యత్తులో మన ప్రజల జీవితాలు చైనా గుప్పిట్లోకి వెళ్లిపోతాయన్నమాట. అప్పుడు చైనా ఈ డ్యాంని బూచిగా చూపించి మన భారతదేశాన్ని లొంగదీసుకోవడానికి ప్రయత్నించొచ్చు.
చైనా కడుతున్న ఈ మెగా ప్రాజెక్ట్ వల్ల భారత్‌కి పొంచిఉన్న ప్రమాదాన్ని ముందుగానే అర్థం చేసుకున్న మన గవర్నమెంట్ ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. చైనా కట్టబోతున్న మెగా డ్యాంకి పోటీగా.. అరుణాచల్ ప్రదేశ్‌లో 'దిబాంగ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్'ని స్టార్ట్ చేసింది. ఇది కేవలం ఒక డ్యామ్ కాదు, ఇది ఓ రకంగా ఈశాన్య రాష్ట్రాలకి, ఇంకా మాట్లాడితే చైనా నుంచి మొత్తం భారత్‌కి ఓ రక్షణ కవచం లాంటిది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కాంక్రీట్ గ్రావిటీ డ్యామ్‌గా దీన్ని నిర్మించబోతోంది గవర్నమెంట్. ఈ ప్రాజెక్ట్ చైనా వైపు నుంచి వచ్చే నీటిని నియంత్రించి, వరదల ప్రమాదాన్ని చాలావరకు తగ్గిస్తుంది. అలాగే అలా స్టోర్ చేసుకున్న నీటిని చైనా ఎప్పుడైనా నీళ్లు వదలకుండా బ్యాన్ చేస్తే ఉపయోగించకోవడానికి వీలుంటుంది.
ఈ దిబాంగ్ మల్టీపర్పస్ ప్రాజెక్టులోని ప్రధాన డ్యామ్ నిర్మాణానికి సంబంధించి.. ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్ రూ.17,069 కోట్లతో బిడ్ దాఖలు చేసింది. గతేడాది ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన ఈ ప్రాజెక్ట్.. 278 మీటర్ల ఎత్తులో ఉండి దేశంలోనే ఎత్తైన ఆనకట్టగా రికార్డులకెక్కబోతోంది. ఈ ప్రాజెక్ట్ ఏడాదికి 11,223 మిలియన్ యూనిట్లు.. అంటే 2,880 మెగావాట్ల కరెంట్‌ని ఉత్పత్తి చేయగలదు. ఈ ప్రాజెక్ట్ వల్ల చైనా మనపై నీటిని ఒక ఆయుధంగా ఉపయోగించే అవకాశం చాలావరకు తగ్గుతుంది. చైనా ఒకవేళ వాళ్ల డ్యామ్ నుంచి సడెన్‌గా నీళ్లు రిలీజ్ చేస్తే.. మన డ్యాం ఆ నీటి ప్రవాహానికి ఒక అడ్డుగోడలా నిలబడి.. భారత భూభాగాలు వరద బారిన పడకుండా కాపాడుకోగలుగుతాం. అన్నింటికంటే ముఖ్యంగా మన దేశానికి స్ట్రాటజికల్‌గా, సెక్యూరిటీ పరంగా.. చాలా స్ట్రాంగ్ హోల్డ్ కల్పిస్తుంది. ముందు మన ఈశాన్య రాష్ట్రాలని కాపాడుకోవడానికి.. అక్కడి ప్రజలకు ఒక బలమైన భరోసా ఇవ్వబోతోంది. అందుకే ఈ దిబాంగ్ ప్రాజెక్ట్‌ని సూపర్ స్పీడ్‌తో నిర్మించి.. 91 నెలల్లో పూర్తి చేయాలని, 2032 కల్లా అందుబాటులోకి తీసుకురావాలని గవర్నమెంట్ లక్ష్యంగా పెట్టుకుంది. అంటే చైనా డ్యాం పూర్తయిన రెండేళ్లలో మన డ్యాం కూడా పూర్తి కావాలనేది ప్రభుత్వం టార్గెట్ అన్నమాట. ఒకవేళ భారత్ ఈ ప్రాజెక్ట్‌ని అనుకున్న టైంలోగా పూర్తి చేస్తే.. భారతదేశం నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్.. చైనాతో ఢీ అంటే ఢీ అనే స్థాయికి మనల్ని చేర్చడమే కాకుండా.. ప్రపంచ ఇంజినీరింగ్ అద్భుతాల్లో ఒకటిగా నిలిచిపోతుంది.
మరి మనందరం కూడా అనుకున్న టైంలో, అనుకున్న స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌ని మన భారత్ పూర్తి చేయాలని, చైనా ఈవిల్ ప్లాన్‌కి చెక్ పెట్టగలిగే స్థాయికి చేరుకోవాలని కోరుకుందాం. ఇది ఇవ్వాళ్టి ఇండియా మాటర్స్. అండ్ వచ్చే వారం ఇలాంటి ఇంకో ఇంట్రస్టింగ్ టాపిక్‌తో మీ ముందుకొస్తాను. అప్పటివరకు జైహింద్.





















