(Source: Poll of Polls)
Tpt Ruia Hospital: అరవై సంవత్సరాలు పైబడి వ్యాక్సిన్ వేయించుకోనివారికే పరీక్షలు చేస్తున్నాం..
కరోనా లక్షణాలు ఉన్న రోగులకు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నామని తిరుపతి రుయా ఆసుపత్రి పర్యవేక్షణాధికారి డా.భారతి చెప్పారు. ఇవాళ రుయా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డా.భారతీ మీడియాతో మాట్లాడుతూ.. 60 సం" పైబడి వ్యాక్సినేషన్ వేయించుకోని వారికే కరోనా పరీక్షలు నిర్వహించి కిట్లు పంపిణీ చేస్తున్నామన్నారు.. ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు అవసరం లేదని నిబంధనలు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకూ 140 మంది వైద్య సిబ్బందికి కోవిడ్ నిర్ధారణ అయిందని, ఇందులో 80 శాతం మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారని తెలిపారు.. మొత్తం 12 మంది సిబ్బంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆమె తెలియజేశారు.. కరోనా పరీక్షలు చేయలేదనే ఆందోళన వద్దన్నారు. మాస్క్ లు తప్పని సరిగా ధరించి భౌతిక దూరం పాటిస్తే కరోనాను నియంత్రించవచ్చన్నారు. అలా అని కరోనా వ్యాధి పట్ల నిర్లక్ష్యం వద్దని సూచించారు.