Srisailam: శ్రీశైలం దర్శనానికి ఆదార్ గుర్తింపు కార్డు తప్పనిసరి చేసిన దేవస్థానం
శ్రీశైల దేవస్థానములో ఆయా ఆర్జితసేవలు స్వామివారి గర్భాలయ అభిషేకం, సామూహిక అభిషేకం, కుంకుమార్చన కల్యాణోత్సవం మొదలైన ఆర్జితసేవలను జరిపించుకునే భక్తులు, అదేవిధంగా ఆర్జిత హోమాలను జరిపించుకునే భక్తులు కరెంట్ బుకింగ్ ద్వారా టికెట్లు పొందేటప్పుడు గుర్తింపు కోసం ఆధార్ కార్డును తప్పనిసరిగా దేవస్థానానికి సమర్పించాలని ఆలయ ఈవో లవన్న తెలిపారు అదేవిధంగా విరామదర్శనం టికెట్లు మరియు స్పర్శదర్శనం టికెట్లు పొందే భక్తులు కూడా తప్పనిసరిగా గుర్తింపు కోసం ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీని సమర్పించవలసి వుంటుందని అర్జిత సేవలు,స్పర్శదర్శన టికెట్ల జారీ విధానములో పూర్తి పారదర్శకత కోసం ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతోందని ఈవో లవన్న అన్నారు



















