Srikakulam SP: రామచంద్రాపురం సర్పంచ్ పై కాల్పులు...కేసు చేధించిన పోలీసులు
శ్రీకాకుళం పట్టణంలో కలకలం రేపిన కాల్పుల కేసును పోలీసులు చేధించారు. గార మండలం రామచంద్రాపురం సర్పంచ్ వెంకటరమణ పై హత్యాయత్నానికి సంబంధించి శ్రీకాకుళం నగరానికి చెందిన షాలిని అనే మహిళను ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు.ఆర్ధిక లావాదేవీలే షాలినీ, వెంకటరమణ ల మధ్య వివాదానికి దారితీసినట్లు దర్యాప్తులో తేలినట్లుగా జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు. హానీ ట్రాప్ ద్వారా షాలిని వెంకటరమణ నుంచి 10 లక్షల రూపాయల బ్లాక్ మెయిల్ చేశారని.. డబ్బులు కోసం బెదిరించే క్రమంలో భాగంగా గన్ ని ఉపయోగించారని.. అయితే గన్ మిస్ ఫైర్ కావడంతో వెంకటరమణ తృటిలో తప్పించుకున్నారని తెలిపారు ఎస్పీ అమిత్ బర్దార్. ఈ ఘటనలో షాలిని తోపాటు ఉత్తర ప్రదేశ్ కి చెందిన ఆమె సోదరుడు గిరి సహా మధ్ ప్రదేశ్ కి చెందిన మోహిద్ పాల్గొన్నట్లుగా పోలీసులు గుర్తించారు. .నిందితులనుండి 7.6 5 ఏమ్ ఏమ్ గన్ , బులెట్లను స్వాదీనం చేసుకుని వారిని రిమాండ్ కి తరలించినట్లు ఎస్పీ తెలిపారు.