Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Andhra News: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్ సరిహద్దులో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Ysrcp Social Media Acrivist Varra Ravinder Reddy Arrest: వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్ రెడ్డిని (Varra Ravinder Reddy) పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని మహబూబ్‌నగర్ (Mahabubnagar) సరిహద్దులో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. భారీ భద్రత నడుమ కడప పీఎస్‌కు తరలిస్తున్నారు. గత 4 రోజుల క్రితం వర్రా రవీంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 41ఏ నోటీసులు జారీ చేసి వదిలేశారు. దీనిపై సీఎం చంద్రబాబు (CM Chandrababu), డీజీపీ ద్వారకా తిరుమలరావు (Dwaraka Tirumalarao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మళ్లీ అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. ఈ ఘటనలో కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో పాటు చిన్నచౌక్ సీఐ తేజోమూర్తిని సర్కారు సస్పెండ్ చేసింది. గత 4 రోజులుగా కడప, అన్నమయ్య జిల్లా పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు.
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి.. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, అనిత, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, జగన్ తల్లి విజయమ్మ, మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీతలపై సోషల్ మీడియాలో అత్యంత హేయంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. అతనిపై మంగళగిరి, హైదరాబాద్‌లో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకుని కడప పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వర్రా రవీందర్‌రెడ్డిని పోలీసులు వదిలేయడంతో ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. కర్నూలు రేంజ్ డీఐజీ ప్రవీణ్‌ను కడపకు పంపి ఆయన ఇచ్చిన నివేదిక మేరకు జిల్లా ఎస్పీని బదిలీ చేయడం సహా మరికొన్ని చర్యలకు ఉపక్రమించింది. నోటీసులిచ్చి వదిలేసే సమయంలో మరో కేసులో అరెస్ట్ చేసేందుకు రాజంపేట పోలీసులు కడపకు రాగా.. కడప పోలీసులు వారికి అప్పగించకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో రవీంద్రారెడ్డి పారిపోయాడు. దీంతో అతని కోసం గాలింపు చేపట్టి ఎట్టకేలకు పట్టుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: Congress Vs BRS: కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల తూటాల పేలుళ్లు - ఆటంబాబులు పేలుతాయా?