అన్వేషించండి

Congress Vs BRS: కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల తూటాల పేలుళ్లు - ఆటంబాబులు పేలుతాయా?

Telangana News: తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్య పొలిటికల్ వార్ స్టార్ట్ అయింది. కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని హస్తం నేతలు అంటున్నారు. మరి ఎలా ఉండనుందే అని ఆసక్తికరంగా మారింది.

War Between Congress And BRS: తెలంగాణలో దీపావళి ముగిసినా బాంబుల మోత మోగుతోంది. ఇటీవలే పండుగ సందర్భంగా ప్రజలందరూ టపాసులు కాల్చి సంబరాలు జరుపుకొన్న సంగతి తెలిసిందే. అయితే, దీపావళి ముగిసినా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై మరొకరు పొలిటకల్ బాంబులు విసురుకోవడం విశేషం. గులాబీ నేతల అరెస్టు తప్పదని కాంగ్రెస్ నేతలు అంటుంటే.. చేస్తే చేసుకోండి మేం సిద్దమే అని బీఆర్ఎస్ నేతలు సవాల్ విసురుతున్నారు.

ఆటంబాంబు పేలేనా?

తెలంగాణలో ఆటంబాంబులు పేలనున్నాయా... దీపావళికి ముందే పేలతాయని చెప్పిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరో దఫా త్వరలోనే ఆటంబాంబులు పేలతాయని నర్మగర్భంగా చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ సహా కొందరు  బీఆర్ఎస్ నేతలు జెైలుకు వెళ్లడం ఖాయమని కాంగ్రెస్ నేతలు పదే పదే చెప్తున్నారు. అందుకు అనుగుణంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరగాన బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ప్రధాన నిర్ణయాలపై సమీక్ష చేపట్టారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు, నిధుల వినియోగం, విద్యుత్ కొనుగోళ్లు, ధరణి పేరుతో భూముల డిజిటలైజేషన్ ప్రక్రియ ఇలా పలు అంశాలపై రేవంత్ సర్కార్ విచారణ చేపట్టింది. కొన్నింటిపై ప్రత్యేక కమిషన్లు, కమిటీలు వేసి విచారణ చేస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మంత్రులు, ముఖ్య నేతలు కేసీఆర్, కేటీఆర్ సహా గులాబీ ముఖ్య నేతలంతా జైలుకు వెళ్లడం ఖాయమని బహిరంగ ప్రకటనలు చేస్తూ వచ్చారు.  

అయితే, తాజాగా దీపావళి ముందు కాంగ్రెస్ సర్కార్‌లోని కీలక మంత్రి పొంగులేటి  త్వరలోనే  గులాబీ నేతలు జైలుకు వెళ్లడం ఖాయమని బాంబు పేల్చారు. దీంతో తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. పండుగ తర్వాత ఏం బాంబులు పేలలేదంటూ  అటు బీఆర్ఎస్ నేతలు, మీడియా ప్రశ్నించండతో పాటు , సోషల్ మీడియాలో ట్రోల్స్ వంటివి సాగాయి. తాజాగా మళ్లీ తప్పు చేసిన వారి అరెస్టు తప్పదని, ఇవీ మామూలు బాంబులు కావని ఆటంబాంబులు అని మంత్రి పొంగులేటి చెప్పడంతో ఇక గులాబీ నేతలు అరెస్టులు తప్పవన్న ప్రచారం విరివిగా సాగుతోంది. అందులోనూ మాజీ మంత్రి కేటీఆర్‌ను కార్ రేస్ వ్యవహారంలో అరెస్టు చేస్తారన్న ఊహాగానానాలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలోను, ప్రధాన మీడియాలోను సాగుతున్నాయి. ఇటీవలే ఏసీబీ అధికారులు మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టుకు అనుమతి కోరుతూ తెలంగాణ గవర్నర్‌ను కలిశారన్న వార్తలు వినవస్తున్నాయి. అయితే మంత్రి  పొంగులేటి ద్వారా సీఎం రేవంత్ రెడ్డి విసిరిన రాజకీయ ఆటం బాంబు ఎప్పుడు పేలుతుందా అన్న ఉత్కంఠ ఇప్పుడు సర్వత్రా నెలకొంది.

కేటీఆర్ మాటల తూటాలు

ఇదిలా ఉంటే.. తన అరెస్టు విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విసిరిన పొలిటికల్ బాంబుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన మాటల తూటాలను వదిలారు. కార్ రేస్ వ్యవహారంలో పురపాలక శాఖ మంత్రిగా తాను ఎలాంటి తప్పు చేయలేదని,  హైదరాబాద్‌లో కార్ రేస్ నిర్వహించకుండా తెలంగాణాకు సీఎం రేవంత్ రెడ్డినే అన్యాయం చేశారని పొలిటికల్‌గా కేటీఆర్ ఫైర్ అయ్యారు. తాను ఎలాంటి తప్పు చేయకున్నా రాజకీయ ఉద్దేశంతో జైలుకు పంపితే హ్యాపీగా వెళ్లొస్తానని, 2 నెలల పాటు జైల్లో వేసినా అక్కడ ఏం చేయాలో ముందుగానే ప్రిపేర్ అయినట్లు, అందుకు తగ్గట్టుగా తాను టైం టేబుల్ తయారు చేసుకున్నట్లు కేటీఆర్ మీడియా సమావేశంలో చెప్పడం విశేషం. ఓ రకంగా చెప్పాలంటే కేటీఆర్ సైతం మానసికంగా ఇందుకు సిద్దం అయినట్లు తన మాటల ద్వారా తెలుస్తోంది. 

'రాజకీయాలు మారనున్నాయా..?'

ఏపీ రాజకీయాల్లో గత పదేళ్లుగా రాజకీయ నేతల అరెస్టులు, జైలుకెళ్లడం చూశాం. పార్టీలు, కార్యకర్తల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఊళ్లకు ఊళ్లే పార్టీలకు అనుగుణంగా నిట్టనిలువుగా చీలిపోయిన పరిస్థితులు కనిపిస్తాయి. సోషల్ మీడియాలో పార్టీల వార్ సంగతి ఇక సరే సరి. సర్పంచ్ ఎన్నికల నుంచి ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల వరకు రెండు ప్రధాన పార్టీ మద్ధతుదారుల మధ్య యుద్ధాలే సాగుతున్న పరిస్థితి కళ్ల ముందు కనిపిస్తోంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలు జీవితం గడిపారు. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత  జైలు జీవితం గడిపారు. అయితే పై రెండు రాజకీయ ప్రేరేపితమే అన్న విమర్శలు ఉన్నాయి. ఈ కేసుల్లో ఎంతో కొంత వాస్తవాలు ఉన్నాయి. అయితే కోర్టు తీర్పు ఇచ్చే వరకు టెక్నికల్ గా నిందితులు అనాలే తప్ప నేరస్థులని ఎవరినీ అనడానికి లేదు. కానీ రాజకీయ నేతలు కోర్టు కేసుల్లో ఇరుక్కున్నా, జైలు జీవితం గడిపినా.. నైతికంగా ప్రజల ముందు పలుచన కాక తప్పదు. అయితే కాంగ్రెస్ నేతల  అరెస్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఇక ఇప్పుడు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ తరహా రాజకీయాలకు తెరలేస్తుందా అన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

జగన్మోహన్ రెడ్డి అక్రమాస్థుల ఆర్జన కేసులో జైలుకు వెళ్లారు. ఆ తర్వాత ఆయన సీఎం అయ్యాక టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును జగన్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైల్లో పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు సైతం ఏపీలో జగన్ పాలన నిర్ణయాలపైన సమీక్ష జరుపుతున్నారు. ఇక రాజకీయ నాయకులను పాలనా నిర్ణయాల పై జైలుకు పంపండం ఏపీలో షూరూ అయింది. అదే రీతిలో తెలంగాణలో ఇప్పుడు రేవంత్ సర్కార్ కేసీఆర్ పాలన నిర్ణయాలపై చర్యలు తీసుకునేందుకు సిద్దం అవుతోంది. ఏపీలో  ఎన్నికలు ఉన్నా లేకున్నా  అక్కడ టీడీపీ- వైఎస్ఆర్సీపీ నేతల నుండి కార్యకర్తల వరకు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రానున్న రోజుల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య ఇదే రీతిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ కార రాజకీయాలు ఏలాంటి రాజకీయ వాతావరణం సృష్టిస్తుందో ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం. రానున్న రోజుల్లో ఇది ఏ మలుపులు తీసుకుంటుందో అన్న ఆందోళన ప్రజాస్వామిక వాదుల్లో నెలకొంది. 

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?

వీడియోలు

Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Chandrababu on water dispute: నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget