Arasavilli: సకలలోకాలకు వెలుగులు ప్రసాదించే శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి సూర్యనారాయణుడు
ప్రభాత వేళలో ప్రత్యక్షమై ప్రపంచానికి మేలు కొలిపే ప్రత్యక్ష దైవం.... సకల లోకాలకు తన వెలుగుల ద్వారా వెలుగులు ప్రసాదించే దేవ దేవుడు.... అరసవల్లి సూర్యనారాయుడు. అలాంటి ప్రత్యక్ష దైవం కొలువైన ప్రదేశం శ్రీకాకుళం జిల్లా అరసవల్లి. ఇక్కడ కొలువైన శ్రీసూర్యనారాయణస్వామి మనుషులు చేసే పాపాలతో పాటు చర్మ, శుక్ల, శోక రోగాలను సైతం తన కిరణ స్పర్శతో హరిస్తాడని ప్రతీతి. నిత్య పూజలందుకుంటున్న శ్రీ సూర్యనారాయణ స్వామి అరసవల్లి దేవస్థానంలో కొలువై ఉండడం విశేషం. రాష్ట్రంలోనే కాకుండా యావత్ దేశంలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆదివారం పోలి పాడ్యమి కావడంతో సూర్యనారాయణ స్వామి దర్శించుకునేందుకు వేలాది సంఖ్యలో భక్తులు వచ్చారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆనంద్ అందిస్తారు




















