Nellore Gopal Nagar Issue : నెల్లూరు నక్కా గోపాల్ నగర్ స్థానికుల విన్నూత్న నిరసన
నెల్లూరు నక్కా గోపాల్ నగర్ లో కొంతమంది అక్కడి గుడిసెలు పీకేయడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో కొంతమంది గాయపడ్డారు. పోలీసులు ఇరు వర్గాల ఫిర్యాదులని తీసుకుని కేసులు నమోదు చేశారు. అయితే తమ గుడిసెలు పీకేశారంటూ తమకి నిలువ నీడ లేకుండా చేశారంటూ బాధితులు విన్నూత్న నిరసన చేపట్టారు. నేరుగా కలెక్టరేట్ కి వెళ్లి, ఆ ప్రాంగణంలోనే నివాసం ఉంటామంటూ అక్కడినుంచి కదల్లేదు. దీంతో అధికారులు వారికి స్థానికంగా ఓ కల్యాణ మండపంలో ఆశ్రయమిచ్చారు. అక్కడినుంచి వారు నేరుగా ఆర్డీవో ఆఫీస్ కి వచ్చారు. తమ ఇళ్లను తొలగించినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు ఆర్డీవో ఆఫీస్ ముందే బైఠాయించారు. రాత్రి అక్కడే రోడ్డుపై భోజనం చేసి, అక్కడే నిద్రించారు. చలి వణికిస్తున్నా వారు మాత్రం అక్కడినుంచి కదల్లేదు. తమకు ప్రత్యామ్నాయం చూపే వరకు అక్కడినుంచి కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు.