![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
కర్ణాటకలో తిరుమల లడ్డు వివాదం ఎఫెక్ట్, అన్ని ఆలయాల్లో నందిని నెయ్యి
తిరుమల లడ్డు వివాదం ఎఫెక్ట్ కర్ణాటకలో కనిపిస్తోంది. సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో ప్రసాదాలు తయారు చేసేందుకు నందిని డెయిరీ అందించే నెయ్యిని మాత్రమే వాడాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటకలో దాదాపు 35 వేల ఆలయాలున్నాయని అంచనా. ఈ ఆలయాల్లో లడ్డూలు తయారు చేసేందుకు.. Karnataka Milk Federation కి చెందిన నందిని నెయ్యిని మాత్రమే వినియోగించాలని ప్రభుత్వం తేల్చి చెప్పింది. లడ్డు అనే కాదు. ఇతరత్రా ఏ ప్రసాదాలకైనా సరే...కచ్చితంగా ఇదే నెయ్యి వాడాలని వెల్లడించింది. అయితే...ఇప్పటికే 99% ఆలయాల్లో నందిని నెయ్యినే వాడుతున్నారని..ఇకపై అన్ని చోట్లా ఇదే వినియోగం జరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిజానికి...టీటీడీకి కూడా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచే నెయ్యి అందేది. నాలుగేళ్ల నుంచి వీళ్లు టెండర్లు వేయలేదు. ఫలితంగా..టీటీడీ వేరే వాళ్లకు ఆ టెండర్ ఇచ్చింది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చాక..KMF నెయ్యి సప్లై చేయడం మొదలు పెట్టింది.
![8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/22/b120a82302a0e0997573020a0b809ab41734860553726234_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)