PM Modi Strategy no War | యుద్ధం వద్దని ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం తప్పా | ABP Desam
పాకిస్థాన్ పై ఆల్మోస్ట్ యుద్ధానికి సిద్ధం..పీవోకే మళ్లీ మనోళ్లు లాగేసుకుంటారు. గత రెండు మూడు రోజులుగా ప్రతీ భారతీయుడి ఆలోచనా ఇదే. రేవంత్ రెడ్డి, ఒవైసీ, హరీశ్ రావు పార్టీలతో సంబంధం లేదు..మతాల ప్రస్తావనే లేదు. మీ వెనుక మేమున్నాం మోదీజీ మన సైన్యానికి పూర్తి స్వేచ్ఛనివ్వండి ఈ సారి ఏదో ఒకటి తేలిపోవాలి అంతే అనే స్ఫూర్తిని ప్రజల్లో రగిల్చారు అంతా. కానీ మోదీ శాంతిమార్గాన్ని ఎంచుకున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించుకున్నట్లు ఆయన సుదీర్ఘ మంతనాల కారణంగా పాక్, భారత్ రెండూ శాంతి ఒప్పందానికి వచ్చి కాల్పుల విరమణకు అంగీకరించాయట. అయితే పాకిస్థాన్ అధికారులే మన అధికారులకు ఫోన్ చేసి కాల్పులు ఆపాలని అడిగారు కాబట్టి ప్రధాని మోదీ నిర్ణయం మేరకు తాము కూడా అంగీకరించామని విదేశాంగ మంత్రి విక్రమ్ మిస్రీ ప్రకటించారు. బట్ ఇది మన దేశంలో చాలా మందికి నచ్చలేదు. భిన్నమైన అభిప్రాయాలే ఎక్కువ వస్తున్నాయి. భారత్ విశ్వగురు అని చెప్పే మోదీ మన దేశ భద్రతకు సంబంధించిన విషయాన్ని ఎందుకు మరొకరి మాటలకు కట్టుబడేలా చేశారని. ఇక్కడే ఇంకో దారుణంగా ముందంతా కాపాడండయ్యా మమ్మల్ని అన్నట్లు నక్క వినయాలు పాటించిన పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందం అయిన మూడు గంటలకే మళ్లీ డ్రోన్ దాడులు చేయటంతో పాటు భారత్ మీద తమ దేశం యుద్ధంలో విజయం సాధించిని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సిగ్గు లేకుండా ప్రకటన చేసుకున్నారు. నలుగురు నవ్విపోదురుగాక నాకేటీ సిగ్గు అనుకున్నాడేమో షరీఫ్..మన మంచితనాన్ని చేతకాని తనంగా చిత్రీకరించారు. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఒకటి ఉంది. పాకిస్థాన్ తో యుద్ధానికి వాళ్లను ఓడించటం మనకు చాలా అంటే చాలా తేలిక. పాక్ అణ్వస్త్ర దేశం అయితే మా దగ్గర దీపావళి బాంబులేమన్నా ఉన్నాయా మా దగ్గరా ఉన్నాయ్ గతంలోనే మోదీ ప్రకటించారు కూడా. కానీ ఇక్కడ ఆయన ఇంటెన్షన్ ఉగ్రవాదంపై ఉక్కుపాదం. అది మనం సాధించాం. ఆపరేషన్ సిందూర్ తో సింగిల్ రౌండేసి వందకు పైగా ఉగ్రవాదుల ప్రాణాలు గాల్లో కలిపేశాం. బట్ ఈ పనిలేని పాకిస్థాన్ తో యుద్ధం పెట్టుకుంటే వాళ్లకు పోయేదేం లేదు. అసలు పోవటానికి వాళ్ల దగ్గరేం లేదు.నష్టం మనకే అని మోదీ ఆలోచించి ఉండొచ్చు. అపారమైన అనుభవం ఉన్న సీడీఎస్ అని చౌహాన్, అజిత్ ధోవల్ లాంటి NSA, జైశంకర్ , రాజ్ నాథ్ సింగ్ లాంటి కరేజియస్ లీడర్స్ ఉన్న మోదీ టీమ్ ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటే మన ప్రజల డబ్బును పనిలేని పాకిస్థాన్ వృథా చేయకూడదు అని కావచ్చు. యుద్ధం అంటూ వస్తే అది లాంగ్ రన్ లో మన ప్రజలపై పడే తీవ్ర భారాన్ని ఆలోచించి కూడా వద్దనుకుని ఉండొచ్చు. ఇదంతా ఓకే కానీ మోదీజీ ఓ మాత్రం ఓ పని చేయాల్సింది. అసలు ఈ కాల్పుల విరమణ ఒప్పందం క్రెడిట్ ఏదో ట్రంప్ కి ఇవ్వకుండా పాకిస్థానే నేరుగా మీడియా ముందుకు వచ్చి కాల్పులు ప్రతిపాదన చేసి ఉంటే మనోళ్లు ఒప్పుకుని ఉంటే బాగుండేది కానీ అమెరికా లాంటి దేశాన్ని మధ్యలో సాక్షి భూతంగా ఇరికించటం మాత్రం కాస్త పంటి కింద రాయిలాంటిదే.





















