Pakistan PM Shehbaz Sharif | భారత్ పై విజయాన్ని ప్రకటించుకున్న పాకిస్థాన్ | ABP Desam
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఓవర్ యాక్షన్ మొదలుపెట్టారు. అమెరికా మధ్యవర్తిత్వంతో పాక్ పై కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్ ఒప్పుకోగా..పాక్ ఆర్మీ రాత్రి మళ్లీ వక్రబుద్ధి చూపించుకుంది. జమ్ము సహా అనేక ప్రాంతాల్లో డ్రోన్ దాడులకు తెగబడింది. అయితే భారత సైన్యం ఆ దాడులను సమర్థంగా తిప్పికొట్టడంతో పాటు పాక్ కు హెచ్చరికలు జారీ చేసింది. అయితే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాత్రం భారత్ పై తమ దేశం విజయం సాధించినట్లు ప్రకటించుకున్నారు. ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ నేతృత్వంలో పాక్ భారత్ పై గెలిచిందని ప్రకటించుకున్నారు. మే10ని ఇకపై విక్టరీ డేగా.. మే11ను గ్రాటిట్యూడ్ డేగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. పాక్ ప్రధాని చేసిన ప్రకటనపై భారతీయులు మండిపడుతున్నారు. మన ప్రధాని మోదీ అసలు కాల్పుల విరమణకు ఒప్పుకోకుండా ఉండాల్సిందని కొంత మంది అభిప్రాయపడుతున్నారు. కానీ మోదీ లాంటి నాయకుడు అలాంటి డెసిషన్ తీసుకున్నారు అంటే దాని వెనుక చాలా ఆలోచించే ఉంటారనేది మరికొందరి వాదన.





















