One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desam
2029లో జమిలి ఎన్నికలు జరిపి తీరతామని ఇటీవలే కేంద్రహోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ స్టేట్‌మెంట్‌కి తగ్గట్టుగానే మిగతా ప్రాసెస్ అంతా స్పీడప్ అయింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. రానున్న శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలోనే మరోసారి దేశవ్యాప్తంగా ఒకే దేశం ఒకే ఎన్నికపై చర్చ జరుగుతోంది. సింపుల్‌గా చెప్పాలంటే...లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమే ఈ జమిలీ ఎన్నికలు. ఒకే ఏడాదిలో ఎన్నికలున్నప్పుడు...ఒక్కోసారి నిర్వహించే బదులు...ఒకేసారి కండక్ట్ చేయాలన్నదే...ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్. 2018లోనే ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్‌ని కేంద్ర న్యాయశాఖ ఓ నివేదికను సమర్పించింది. 1951లో తొలిసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. తొలి జమిలీ ఎన్నిక అదే. 1967 వరకూ ఇదే ట్రెండ్ కొనసాగింది. ఆ సమయంలో హంగ్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. గడువుకు ముందే కొన్ని ప్రభుత్వాలు రద్దయ్యాయి. ఫలితంగా...ఆ ప్రక్రియ ఆగిపోయింది. మళ్లీ ఇప్పుడు ఆ చర్చ జరుగుతోంది. స్వీడెన్, సౌతాఫ్రికా, ఇండోనేషియాలో ఇప్పటికే ఈ ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు. నేషనల్ అసెంబ్లీతో పాటు లోకల్ బాడీస్ ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తున్నాయి..ఈ దేశాలు. బెల్జియం, జర్మనీ కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఇక అగ్రరాజ్యం అమెరిగా విషయానికొస్తే...నాలుగేళ్లకోసారి నవంబర్ నెలలో మొదటి మంగళవారం రోజున ఎన్నికలు నిర్వహిస్తారు. ఇందులో ఎలాంటి మార్పూ ఉండదు.
![Minister Jai Shankar on Deportation | మహిళలు, చిన్నారులకు సంకెళ్లు వేయరు | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/06/6a5470a2806d7927d3e8be319ef80c6b1738854494471310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=470)
![Illegal Immigrants Deportation | పార్లమెంటులో భగ్గుమన్న ప్రతిపక్షాలు | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/06/7c0b94ed5abf3075be1060b5fcc2a4d21738854113515310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![USA illegal Indian Migrants Aircraft | అమృత్ సర్ లో దిగిన విమానం వెనుక ఇంత కథ ఉంది | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/06/d19ca2763a4a09f74aac442c54fc826c1738854010060310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![USBP Remarks on Indian Migrants Deportation | ఓవరాక్షన్ చేసిన అమెరికా బోర్డర్ పెట్రోల్ | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/06/44b0215982095d529f4862c21a4e4f0d1738850150180310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Indian Illegal Immigrants Deportation | లక్షలు లక్షలు లాక్కున్నారు..హీనాతి హీనంగా చూశారు | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/06/e228513785116b24cb46411936ae8d1f1738840522045310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)