Sonam Raghuvanshi News | సినిమాలు చూసి చెడిపోతున్నారా..బంగారు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారా.?
మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో హనీమూన్‌కు వెళ్లిన జంట అదృశ్యమయింది.కొద్ది రోజులకు ఆ జంటలో భర్త శవం దొరికింది. హత్యకు గురయినట్లుగా తేలింది. ఇంతకీ ఆ భార్య ఏమైంది అంటే ఊహించలేని అసలు ట్విస్ట్. తన ప్రియుడితో కలిసి కొత్తగా పెళ్లి చేసుకున్న భర్త ప్రాణాలనే తీసింది ఆ భార్య. సోనమ్ రఘువంశీ చేసిన ఈ హత్య, మొత్తం ఉదంతం యావత్ దేశాన్నే షేక్ చేస్తోంది.మేఘాలయలో హత్యకు గురైన ఇండోర్‌కు వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్యకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన భార్యతో కలిసి హనీమూన్ కోసం వెళ్లాడు. మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్‌లోని వీసావ్‌డాంగ్ జలపాతం సమీపంలోని లోతైన లోయలో అతని మృతదేహం గుర్తించింది. అసలు మహిళల్లో ఈ తరహాలో విపరీతంగా నేర ప్రవృత్తి పెరిగిపోవటానికి కారణాలేంటీ..? బ్యాడ్ బోయ్ క్రష్ కల్చర్ సొసైటీలో పెరిగిపోతోందా..ఈ వీడియోలో వివరించిన సంచలన విషయాలను పూర్తి విశ్లేషత్మాక కథనంలో మీరూ చూసేయండి.





















