Hoshiarpur Chinese Missile Found | పంజాబ్ పైకి దూసుకొచ్చిన చైనా మిస్సైల్...కానీ | ABP Desam
భారత్ మీద దాడి చేసేయాలనే ఆత్రం తప్ప పాకిస్థాన్ మరొక్కటి కనపడదు. కళ్లు మూసుకుని మరీ చైనా వాళ్లను నమ్మేస్తున్నారనటానికి ఇవాళ దొరికిన ఈ ప్రొజెక్టైల్ ఏ ఉదాహరణ. పంజాబ్ లోని హోషియార్ పూర్ శివారులో పడిన ఈ ప్రొజెక్టైల్ ను ఆర్థరాత్రి పాకిస్థాన్ ప్రయోగించింది. ప్రొజెక్టెల్ డీటైల్స్ చెక్ చేసిన ఆర్మీ అది చైనాలో తయారైన PL 15 లాంగ్ రేంజ్ ఎయిర్ టూ ఎయిర్ మిస్సైల్ గా గుర్తించారు. దీంతో మన సుఖోయ్ SU 30 MKI అని పేల్చాలని పాకిస్థాన్ అనుకుంది. దీని రేంజ్ కి ఇది సుఖోయ్ కాదు కదా ఊరి మీదకు...కనీసం పొలిమేర దగ్గరకు కూడా రాలేదు. పోనీ పేలిందా అంటే అదీ లేదు. కంప్లీట్ ఇంటాక్ట్ కండీషన్ లో దొరికింది. సో ఇది తుస్ టపాస్. భారత్ ను కొట్టేందుకు చైనాను గుడ్డిగా పాక్ నమ్ముతుంటే..చైనా మాత్రం పేలని ఈ చెత్త చైనా పీస్ లన్నీ పాక్ కి అమ్మేస్తూ డబ్బు చేసుకుంటోంది. సరిపోయారు ఇద్దరూ.





















