హెలికాప్టర్ ప్రమాదంలో గాయపడి తుదిశ్వాస విడిచిన కెప్టెన్ వరుణ్ సింగ్.
సీడీఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో గాయాలపాలై చికిత్స పొందుతోన్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ కన్నుమూశారు. బెంగళూరు కమాండ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.డిసెంబర్ 8న మధ్యాహ్నం తమిళనాడు సూలూర్ ఎయిర్బేస్ నుంచి వెల్లింగ్టన్లోని సైనిక కళాశాలకు సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దంపతులు సహా మరో 11 మంది అధికారులు వెళుతున్న క్రమంలో కూనూర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో రావత్ దంపతులు సహా మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ఆయనను బెంగళూరు తరలించి చికిత్స అందించారు. అయితే మృత్యువుతో పోరాడి ఆయన కూడా కన్నుమూశారు.





















