Arvind Kejriwal CM : పంజాబ్ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ సీఎం అభ్యర్థి ఎవరో తేల్చిన కేజ్రీవాల్
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ సీఎం అభ్యర్థిపై పార్టీ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ క్లారిటీ ఇచ్చారు. ఆమ్‌ఆద్మీ సీఎం అభ్యర్థిని ప్రజలే నిర్ణయిస్తారన్నారు. ఆమ్‌ఆద్మీ సీఎం అభ్యర్థిని వచ్చే వారం ప్రకటిస్తామని బుధవారం జరిగిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్ అన్నారు. కానీ ఇంతలోనే ఆ పని ప్రజలదేనని చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ కూడా ఇదే బాటలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌పై పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల తరువాత సీఎంగా ఎవరు ఉండాలనేది పంజాబ్ ప్రజలే నిర్ణయిస్తారన్నారు. సీఎంను ఎంపిక చేయడంలో ప్రజలదే ప్రధాన పాత్ర అన్నారు. పార్టీ (కాంగ్రెస్) హైకమాండ్ సీఎంను ఎంపిక చేస్తుందని మీకు ఎవరు చెప్పారని మీడియాను ప్రశ్నించారు సిద్ధూ.
#Arvind Kejriwal CM #AAP #PunjabCM #ABPdesam Subscribe To The ABP Desam YouTube Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.