అన్వేషించండి
Covaxin : ఒమిక్రాన్ వేరియంట్ పై కోవాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తున్నదంటున్న డాక్టర్స్.
ఒమిక్రాన్ వేరియంట్ అంత ప్రమాదకరమైనదని తేలనప్పటికీ అప్రమత్తంగా ఉండడం మాత్రం అత్యవసరం. ఈ వేరియంట్ పై ఏ టీకాలు సమర్థవంతంగా పనిచేస్తాయనే అంశాల్లో కూడా పరిశోధనలు సాగుతున్నాయి. కాగా ఇతర టీకాలతో పోలిస్తే కోవాక్సిన్ ఒమిక్రాన్ పై ప్రభావవంతంగా పనిచేస్తుందని ఐసీఎమ్ఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) అధికారులు చెబుతున్నారు. కోవాక్సిన్ అనేది వైరియన్ ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ అని, ఇది మొత్తం కరోనా వేరియంట్లను తట్టుకోగలదని, అలాగే అధిక పరివర్తన చెందిన ఒమిక్రాన్ కోవిడ్ వేరియంట్ కు వ్యతిరేకంగా పనిచేయగలదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కోవాక్సిన్ వేయించుకున్న వారికి ఇది శుభవార్తే.
వ్యూ మోర్





















