అన్వేషించండి

#PrabhasHanu Fauji Story Decoded | ప్రభాస్ హనూరాఘవపూడి కొత్త సినిమా కథ ఇదే | ABP Desam

  ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కాంబినేషన్ ఈరోజు అఫీషియల్ అయిపోయింది. ఎస్ ప్రభాస్ డైరెక్టర్ హనురాఘువపూడి కాంబినేషన్ లో సినిమా వస్తోంది. మైత్రీ మూవీస్ మేకర్స్ అండ్ టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈకొత్త సినిమాకు సంబంధించి ఈ రోజు గ్రాండ్ గా పూజా కార్యక్రమం కూడా జరిగింది. ప్రభాస్ తో సలార్ తీసిన ప్రశాంత్ నీల్ కూడా వచ్చి టీమ్ ను విష్ చేశారు. అయితే ప్రభాస్ హనూ సినిమాకు సంబంధించిన లైన్ స్టోరీ ప్లాట్ ఏమై ఉంటుందో అని కాస్త ఆసక్తి రేకెత్తించేలా ఈ రోజు టీమ్ కొన్ని క్లూస్ ఇచ్చింది. ముందుగా ఈ సినిమాకు టైటిల్ ఫౌజీ అని ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. ఈ రోజు అయితే టీమ్ అదే పేరు చెప్పలేదు కానీ డీటైల్స్ చూస్తుంటే మాత్రం అలాంటి పేరే కచ్చితంగా ఉండేలా ఉంది. రెండోది పూజా సెర్మనీలో పెట్టిన ఈ క్లాప్ బోర్డ్ చూడండి ఓ వైపు ఛార్మినార్ అండ్ మరోవైపు కోల్ కతా లోని హుగ్లీ నది అండ్ హౌరా బ్రిడ్జి. అయితే ఈ మధ్యలో చూడండి ఎవరూ చూడరులే అన్నట్లు అస్పష్టంగా కనిపిస్తున్న ఆ గుర్తు ఓ చిరుతపులి అండ్ ఆజాద్ అనే అక్షరాలు. ఎస్ మీ గెస్ కరెక్ట్ ఇది సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హిందు ఫౌజ్ కు సంబంధించిన కథ. పక్కా ఎందుకంటే బోస్ గారి బ్యాక్ డ్రాప్ కోల్ కతా ఈ క్లాప్ బోర్డ్ లో ఆ ప్రాంతాన్ని సూచించే సింబల్ కూడా ఉంది. హీరో ఛార్మినార్ అంటే హైదరాబాద్ కు చెందిన వ్యక్తి ఉంటాడు మే బీ హీరోయిన్ ఫ్రమ్ కోల్ కతా ఆర్ హీరో మిషన్ ఇన్ కోల్ కతా. సో ముందు నుంచి ప్రచారంలో ఉన్నట్లు ఫౌజీ అనే టైటిల్ , ఆజాద్ హింద్ ఫౌజ్ లో పనిచేసే ఓ యోధుడిది అయ్యి ఉండొచ్చు. ఇవన్నీ నీకెలా తెలుసు అంటారా. సరే డైరెక్టర్ హను రాఘవపూడి పోస్ట్ చేసిన ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ పోస్టర్ చూడండి. కిందన్నీ యుద్ధ ట్యాంకర్లు. పైన ఓ భారీ బిల్డింగ్ ను తగులబెడుతున్నట్లు చూడటానికి కొంచెం విక్టోరియా మహల్ ను పోలి ఉంది. అండ్ పైన తగలబడుతున్న బ్రిటీష్ జెండా. మేటర్ ఇంకా అర్థం కాలేదా అండ్ హను రాసిన డిస్క్రిప్షన్ లో ఇది పీరియాడిక్ ఫిలిం అది 1940 లో జరిగిన కథ బట్ హిస్టారిక్ ఫిక్షనల్ అని రాశారు. సో ఇది ఆజాద్ హింద్ ఫౌజ్ లో బోస్ తో కలిసి పనిచేసిన ఓ సోల్జర్ స్టోరీ అయ్యి ఉంటుందనే బలమైన నమ్మకం ఈ ఆధారాలతో ఏర్పడుతోంది. అండ్ ఈ సినిమాలో హీరోయిన్ గా ఇమాన్వీ అనే కొత్త అమ్మాయిని పరిచయం చేస్తున్నారు. ఈ అమ్మాయి మనకు కొత్తే కానీ ఇన్ స్టా బాగా ఫాలో అయ్యే వాళ్లకు ఎప్పటి నుంచో తెలుసు. ఇమాన్ ఇస్మాయిల్ పేరుతో డ్యాన్స్ రీల్స్ అవీ చేస్తూ ఉంటుంది ఈ అమ్మాయి. చాలా వీడియోలు వైరల్ అయ్యాయి కూడా. సో అలా డ్యాన్సింగ్ బ్యూటీ ఫౌజీలో ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసిందన్నమాట. అండ్ హనురాఘవపూడి తన సినిమాల్లో హీరోయిన్స్ ను చాలా స్ట్రాంగ్ గా అండ్ అందంగా పోట్రే చేస్తారు కాబట్టి ఇమాన్వి చాలా మందికి సీతారామంతో మృణాల్ ఠాకూర్ లా  క్రష్ గా మారిపోయినా ఆశ్చర్యం లేదు.

ఎంటర్‌టైన్‌మెంట్‌ వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABP
Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABP
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Balayya - Venky : అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Balayya - Venky : అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Embed widget