Vijay Devarakonda on Betting Apps Case | బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ | ABP Desam
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. కేసు విచారణలో భాగంగా ఈరోజు హీరో విజయ్ దేవరకొండ అధికారుల ముందు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్, మనీ లాండరింగ్ కోణాల్లో విజయ్ పై ఈడీ అధికారులు ప్రశ్నలు గుప్పించారు. బెట్టింగ్ యాప్స్ నుంచి వచ్చిన రెమ్యూనరేషన్స్, కమిషన్స్ గురించి ఆరా తీసినట్లు సమాచారం. అయితే ఈడీ అధికారుల ప్రశ్నలకు విజయ్ దేవరకొండ ఏం సమాధానం ఇచ్చారో మీడియాకు తెలిపారు. తనెప్పుడూ చట్ట విరుద్ధమైన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదని...తను ప్రమోట్ చేసింది గేమింగ్ యాప్స్ అని విజయ్ దేవరకొండ ఈడీ అధికారులకు చెప్పినట్లు తెలిపారు. ఈడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు బదులిచ్చానని చెప్పిన విజయ్ దేవరకొండ మరోసారి అధికారులు పిలిచినా వచ్చి వివరాలు అందించటానికి సిద్ధంగా ఉంటానని మీడియాకు తెలిపారు. అయితే విజయ్ దేవరకొండ గేమింగ్ యాప్స్ ను మాత్రమేనని చెప్పటంతో ఈడీ అధికారులు ఈ కేసులో ఏ నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.





















