అన్వేషించండి

Rishabh Shetty Kantara chapter 1 review | కాంతార చాప్టర్ 1 రివ్యూ | ABP Desam

కాంతార చాప్టర్ 1. రిషభ్ శెట్టి డైరెక్షన్‌లో.. ఆయనే హీరోగా కాంతార మూవీకి ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? కాంతారతో కంపేర్ చేస్తే ఇందులో ఉన్నదేంటి? లేనిదేంటి? అలాగే మోస్ట్ ఇంపార్టెంట్.. కాంతార చాప్టర్ 1 మూవీ రిలీజ్ కాకముందు హరో రిషభ్ శెట్టి హైదరాబాద్ వచ్చి కన్నడలో మాట్లాడటంతో కొంతమంది తెలుగోళ్ల మనోభావాలు దెబ్బతిని సినిమాని బ్యాన్ చేయాలని విపరీతంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. మరి ఆ కాంతార బ్యాన్ ఎఫెక్ట్ మూవీపై రియాలిటీలో పడిందా? 

ఫస్ట్ పాయింట్.. మూవీపై పెద్దగా బాయ్‌కాట్ ఎఫెక్ట్ అయితే ఉన్నట్లు లేదు. ఇక మూవీకి కూడా చాలా మంచి పాజిటివ్ టాక్ వస్తోంది. దీనికి ఫస్ట్ రీజన్ ట్రైలర్‌. ట్రైలర్‌లో మనకి చూపించిన దానికి.. అండ్ సినిమా స్క్రీన్‌మీద మనం చూసే దానికి ఏ మాత్రం కంపేరిజన్ ఉండదు ట్రైలర్ చూస్తే.. మూవీలో కాంతార లోకల్ ఎసెన్స్ మిస్ అయిపోయింది అనుకున్నా. రాజులు, రాణులు, యుద్ధాల సీన్లు చూసి.. ఇది కాంతార పార్ట్ 2 కాదు.. పొన్నియన్ సెల్వన్ పార్ట్ 3 అనుకున్నా. కానీ మూవీ పూర్తిగా చూశాక మైండ్ బ్లాంక్ అయిపోయింది. మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం.. కాంతార మూవీలో లాగే హీరో క్యారెక్టర్, అండ్ ఆదీవాసీల క్యారెక్టర్ల ఎస్టాబ్లిష్‌ చేయడానికే యూజ్ చేశారు. అలాగే సెకండ్ హాఫ్‌‌లో చూపించబోయే ట్విస్ట్‌లకి తెలివిగా క్లూస్ కూడా ఇచ్చారు. దీంతో కొద్దిగా బోర్ అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్ తర్వాత మూవీలో డ్రాస్టిక్ ఛేంజోవర్ వస్తుంది.

స్టోరీ ఏంటంటే.. కాంతార మూవీలో మనకి చూపించిన క్షేత్ర పాలకుడు గుళిగ బ్యాక్ స్టోరీని ఈ మూవీలో చూపించాడు రిషభ్ శెట్టి. అండ్ స్టోరీ చాలా సింపుల్. పింజుర్లి దేవుడికి రక్షగా, పింజుర్లి దేవుడు ఉండే కాంతార అడవికి రక్షగా గుళిగని పంపుతాడు పరమేశ్వరుడు. అయితే ఆ ప్రాంతాన్ని పాలించే రాజవంశం నుంచి కాంతారకి అనుకోని ముప్పు రావడంతో.. ఆ ముప్పు నుంచి కాపాడాటానికి గుళిగతో పాటు శివగణాలన్నీ ఒక్కటై చెడును అంతం చేసి.. కాంతార అడవిని కాపాడుకుంటాయి. దానికి శివుడు కూడా సహాయం చేస్తాడు. ఇదంతా రిషభ్ శెట్టి ద్వారా జరుగుతుంది. అదే ఈ మూవీ స్టోరీ. ట్రైలర్ చూసి.. కాంతారలో ఉన్న లోకల్ ఎసెన్స్ ఈ మూవీలో ఉండదనుకున్నా. కానీ దానికి వెయ్య రెట్లుంది. ఈ విషయంలో రిషభ్ శెట్టికి హాట్సాఫ్ చెప్పాల్సిందే. స్టోరీ అల్లిన విధానం కూడా అద్భుతం. పాయింట్‌కి స్టిక్ అయి.. ఆడియెన్స్‌ని కన్నార్పకుండా కట్టిపడేశాడు. ముఖ్యంగా మూవీ సెకండ్ హాఫ్‌లో వచ్చే ట్విస్ట్‌లకి మీ మైండ్ బ్లాంక్ అయిపోతుంది. 

సెకండ్ హఫ్ స్టార్టింగ్‌లోనే గుళిగ ఉగ్రరూపం చూపించేస్తాడు. కాంతార ఫస్ట్ పార్ట్‌ క్లైమాక్స్‌లో గుళిగ సీన్‌కి ఈ  సీన్ అప్‌డేటెడ్ వెర్షన్‌లా ఉంటుంది. ఈ సీన్ చూశాక.. ఈ సీనే ఇలా ఉంది? ఇక క్లైమాక్స్‌లో ఇంతకి మించి ఇంకేం చూపిస్తాడో అనే క్యూరియాసిటీ వస్తుంది. అందుకే క్లైమాక్స్ అసలు మన ఊహకే అందకుండా పెట్టాడు. శివుడి చుట్టూ కూడా చాలా పవర్‌ఫుల్ స్టోరీ అల్లాడు. కొన్ని సీన్లు అసలు మనల్ని ఊపిరి కూడా తీసుకోనివ్వవు. అంత అద్భుతంగా ఉన్నాయి. క్లైమాక్స్‌లో బాహుబలి 1లో కాలకేయులతో ఫైట్‌కి తగ్గకుండా ఉండే ఓ ఇంట్రస్టింగ్ ఫైట్..  ఫైట్ అయిపోగానే ఉండే ఫైనల్ క్లైమాక్స్ సీన్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తాయి.

ఇక క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే.. హీరో క్యారెక్టర్‌లో మనకి రిషభ్ శెట్టి కనిపించడు.. పూర్తిగా బెరియ మాత్రమే కనిపిస్తాడు. అలాగే ఇలాంటి సినిమాలో కథంతా హీరో చూట్టూతే తిరుగడం కామన్.. కానీ ఈ మూవీలో హీరోతో సమానంగా హీరోయిన్‌ రుక్మిణి వసంత్‌ క్యారెక్టర్ ఉంటుంది. ఫస్ట్ హఫ్‌లో నిజమైన రాజకన్యలా ఎంతో అందంగా, క్యూట్‌గా కనిపించే హీరోయిన్లో సెకండ్ హాఫ్‌లో మనం ఊహించని ఛేంజోవర్ వస్తుంది. అలాగే జయరాం‌కి కూడా చాలా మంచి క్యారెక్టర్ పడింది. సినిమా ఆర్ట్ డైరెక్షన్ కూడా అదిరిపోయింది. ఆ కాలం నాటి ఆటవిక గూడేలు, రాజ్యాలు, పనిముట్లు, ఆయుధాలు.. అద్భుతంగా డిజైన్ చేశారు. అలాగే ఫైట్స్ అండ్ కెమెరా వర్క్ కూడా చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంది. ఒకటి, రెండు పాటలు కూడా బాగున్నాయి. మిగిలిన యాక్టర్స్.. అంటే యువరాజు క్యారెక్టర్ వేసిన గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి లాంటి వాళ్లు కూడా వాళ్ల రేంజ్‌లో బాగా నటించారు. 

Final ga ఒక్కటే మాట చాలా రోజుల తర్వాత వచ్చిన ఫుల్‌ఫ్లెడ్జ్ స్టోరీ బేస్డ్ పాన్ ఇండియా మూవీ కాంతార చాప్టర్ 1.సినిమా అంటే ఇలా ఉండాలి అనిపించింది. క్లైమాక్స్ తర్వాత అప్పుడే అయిపోయిందా అనిపించింది. ఊహించని ట్విస్ట్ లు, అనెక్ట్‌పెక్టెడ్ క్యారెక్టర్ ఛేంజోవర్‌లు.. అసలు audienceని కట్టిపడేసింది. కచ్చితంగా ఇది థియేటర్లో మాత్రమే చూడాల్సిన మూవీ. మొబైల్స్‌లో, టీవీల్లో, ఓటీటీల్లో చూస్తే మీకు ఆ ఫీలే తెలీదు. సో.. అందరూ థియేటర్స్ వెళ్లే ఈ వండర్‌ఫుల్ మూవీని చూడండి.

సినిమా వీడియోలు

Akhanda 2 Premieres Cancelled | భారత్ లో నిలిచిన బాలకృష్ణ అఖండ 2 ప్రీమియర్స్ | ABP Desam
Akhanda 2 Premieres Cancelled | భారత్ లో నిలిచిన బాలకృష్ణ అఖండ 2 ప్రీమియర్స్ | ABP Desam
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maharashtra News: కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Farmhouse Liquor Party: ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maharashtra News: కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Farmhouse Liquor Party: ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
Telugu TV Movies Today: డిసెంబర్ 12, శుక్రవారం.. థియేటర్లలోనే కాదు, తెలుగు టీవీ ఛానళ్లలో కూడా అదిరిపోయే సినిమాలున్నాయ్... ఆ లిస్ట్ ఇదే!
డిసెంబర్ 12, శుక్రవారం.. థియేటర్లలోనే కాదు, తెలుగు టీవీ ఛానళ్లలో కూడా అదిరిపోయే సినిమాలున్నాయ్... ఆ లిస్ట్ ఇదే!
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Tata Sierra SUV కి పోటీగా వచ్చిన Kia Seltos - ఫీచర్లు, ఇంజన్లలో ఏది బెస్ట్ తెలుసా..
Tata Sierra SUV కి పోటీగా వచ్చిన Kia Seltos - ఫీచర్లు, ఇంజన్లలో ఏది బెస్ట్ తెలుసా..
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Embed widget