Kubera Movie Review | Sekhar Kammula ధనుష్, నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన కుబేర ఎలా ఉంది.? | ABP Desam
25 సంవత్సరాలలో 9 సినిమాలు మాత్రమే తీశారు శేఖర్ కమ్ముల. ఈ రోజు రిలీజైన కుబేర సినిమా పదోది. పోనీ ప్లాఫ్స్ ఉన్నారా అంటే కాదు అనామిక మినహాయించి అన్నీ ఒరిజినల్ కథలే. అన్నీ సూపర్ హిట్ సినిమాలే. 9 సినిమాలకు ఓ నేషనల్ అవార్డు... ఆరు నంది అవార్డులు ఆయన ఖాతాలో ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు శేఖర్ కమ్ముల ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఫిల్మ్ మేకరో అని. అలాంటి డైరెక్టర్ నుంచి కుబేర సినిమా వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది. శేఖర్ కమ్ముల ప్రీరిలీజ్ ఫంక్షన్ లో ఓ మాట అన్నారు. రాతను సరస్వతితో పోలుస్తారు నేనెప్పుడూ సరస్వతి దేవి తలదించుకునేలా రాయలేదు కానీ ఓ మాట చెప్పా ఈ సినిమాతో సరస్వతి దేవి తల ఎత్తుకుంటుంది అనీ.
శేఖర్ కమ్ముల తను నమ్మిన సిద్ధాంతాలపైన...తను చూసిన జీవింతపైన మాత్రమే సినిమా తీస్తారు. ఆయన ఏం మాట్లాడతారో ఆయన ఏం నమ్ముతారో అదే తెరపై కనిపిస్తుంది కాబట్టే ఆయన కథల్లో సోల్ ఉంటుందని కుబేర ప్రీరిలీజ్ ఫంక్షన్ లో రాజమౌళి చెప్పిన మాట.
అది ఈ రోజు కుబేర సినిమాతో మరోసారి తెరపై కనపడిందిం. కుబేర సినిమా ఏం అద్భుతమైన కథ కాదు. కానీ మన చుట్టూ ఉన్న సమాజంలో మన కళ్ల ముందే తిరగే...మనం పట్టించుకోని వ్యక్తుల కథ అని చెప్పొచ్చు. రిచ్ అండ్ పూర్ . ఓ ధనికుడు..ఓ బిచ్చగాడి కథ. సామాన్యులు ఎక్కువగా ఉండే మన దేశంలో...కటిక దారిద్ర్యంలో బతికే యాచకులను..అష్టైశ్వర్యాలతో ఉండే ధనవంతుల జీవితాలు ఎక్కువగా ఎక్స్ ప్లోర్ కావు. ధనవంతుల స్థాయిని వాళ్ల ఐశ్వర్యాన్ని ఆశ్చర్యంతో చూస్తుంటాం. ఇక మనకు ట్రాఫిక్స్ సిగ్నల్స్ దగ్గరో...గుళ్లు గోపురాల దగ్గరో కనిపించే బిచ్చగాళ్లను అయితే జాలితోనో లేదా ఛీత్కారంతోనో చూస్తుంటాం. అస్సలు సంబంధం లేని ఈ రెండు ప్రపంచాలు ఓసారి కలవాల్సి వస్తే. క్లాస్ వార్ టాప్ ఛైర్ లో కూర్చునే ఆ టైమ్ లో ఎవరి మనస్తత్వాలు ఎలా పనిచేస్తాయి. నాది నాది నాదే ఈ లోకమంతా అనుకునే స్వార్థరుపరులైన ధనవంతులకు సలాం కొడుతూ.... డబ్బు లేని వాడిని కనీసం పట్టించుకునే సమయం లేని వ్యవస్థల మధ్యలో.... నిజాయతీ పరులకు, విలువలతో బతకాలనుకునే వాళ్లకు దక్కే గౌరవాన్ని ఫిల్టర్ లేకుండా చూపించాలనుకున్నారు శేఖర్ కమ్ముల. క్యాపిటలిజానికి హ్యూమనిజానికి వందల ఏళ్లుగా జరుగుతున్న ఘర్షణను..ఇంకా ఎన్నో థీమ్స్ ను, టాపిక్స్ ను లేయర్ లేయర్లుగా సినిమా అంతా పరిచేసి డిస్కస్ చేశారు శేఖర్ కమ్ముల. ఓ రైటర్ గా ఆయనకున్న థాట్స్ కి, ఐడియాలజీకి, వాటిని సినిమాలుగా తెరపైకి తీసుకువచ్చే విధానాన్ని మెచ్చుకుని తీరాల్సిందే. ఆ స్వచ్ఛమైన ఆలోచనలకు, పాతికేళ్లుగా చెక్కు చెదరకుండా వాటిని సినిమాలుగా మారుస్తూ ఎవర్ లాస్టింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తున్న విధానానికి చప్పట్లు కొట్టాల్సిందే.





















