B Saroja Devi Passed Away | సీనియర్ నటి బీ సరోజా దేవి కన్నుమూత | ABP Desam
70ఏళ్ల సినీ కెరీర్ లో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 200 సినిమాల్లో నటించి మెప్పించిన తొలి తరం నటి బీ సరోజా దేవి కన్నుమూశారు. కొంతకాలంగావృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. బెంగళూరు, యశ్వంతపూర్ లోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె వయస్సు 87 సంవత్సరాలు. 1938లో బెంగుళూరులో జన్మించిన సరోజా దేవి...1955లో 17ఏళ్ల వయస్సులో మహాకవి కాళిదాస అనే కన్నడ సినిమాతో వెండితెరకు పరిచయమమ్యారు. 1957లో ఎన్టీఆర్ హీరోగా విడుదలైన పాండురంగ మహత్మ్యం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బీ సరోజా దేవి 1980వరకూ టాప్ యాక్ట్రెస్ గా దక్షిణాది భాషల్లో నటించి అలరించారు.1955 నుంచి 1984 మధ్య 29ఏళ్లలో 161 సినిమాల్లో లీడ్ హీరోయిన్ గా ఆమె నటించడం విశేషం. 2009లో సూర్య ఘటికుడు చిత్రంలో తెలుగువాళ్లకు చివరిసారిగా కనిపించిన బీ సరోజా దేవి...2019లో నటసార్వభౌమ అనే కన్నడ చిత్రంలో చిన్న క్యామియో రోల్ లో కనిపించారు. ఆమె జీవితం ఆధారంగా 2021లో వచ్చిన జయలలిత బయోపిక్ తలైవిలో రెజీనా బీ సరోజా దేవి పాత్రను పోషించారు. కళారంగానికి అందించిన సేవలకు గానూ 1969లో పద్మశ్రీతోనూ, 1992లో పద్మభూషణ్ తోనూ ఆమెను భారత ప్రభుత్వం గౌరవించింది.





















