బిగ్ బాస్ అడల్ట్ సీన్స్ పై నటి కామెంట్స్..
బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా భారీ టీఆర్ఫీ రేటింగ్స్ తో దూసుకుపోతుంది బిగ్ బాస్ షో. ఇందులో ఫ్రెండ్షిప్స్, లవ్ ట్రాక్స్ చాలా కామన్. ఇప్పటివరకు టెలికాస్ట్ అయిన సీజన్లలో చాలా లవ్ ట్రాక్స్ చూశాం. బిగ్ బాస్ సీజన్ 5లో కూడా కొన్ని ట్రాక్ లు నడుస్తున్నాయి. హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఎలా ఉంటారో తెలియదు కానీ హౌస్ లో మాత్రం ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయామంటూ కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా సిరి-షణ్ముఖ్ ల ప్రవర్తన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి షణ్ముఖ్ చాలా కాలంగా దీప్తితో రిలేషన్ లో ఉన్నాడు. సిరికి కూడా బయట బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. కానీ హౌస్ లోకి వచ్చిన తరువాత ఇద్దరూ బాగా కనెక్ట్ అయ్యారు.





















