(Source: ECI/ABP News/ABP Majha)
CM Chandrababu | IPS Kolli Raghuram Reddy | కొల్లి రఘురామిరెడ్డి నో ఎంట్రీ
కాబోయే సీఎం చంద్రబాబును కలిసేందుకు యత్నించిన ఐపీఎస్ అధికారులకు అనుమతి నిరాకరించారు. మర్యాదపూర్వక భేటీ పేరుతో రాగా పోలీసులు అడ్డుకున్నారు.
151 సీట్లతో సంక్షేమాన్ని ఓ స్థాయికి తీసుకెళ్లిన వైసీపీ పార్టీ 11 సీట్లకు పరిమితమవుతుందని ఎవరైనా ఊహించారా..? కానీ అది జరిగింది. అందుకే అంటారు నాయకుల కంటే ప్రజలు తెలివైన వాళ్లు అని. మరి.. ఈ ఏపీ ఎన్నికల ఫలితాల నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏం నేర్చుకోవాలో ఈ వీడియోలో తెలుసుకోండి..!
ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇప్పటికే అధికార మార్పిడీకి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. చాలా మంది అధికారులు చంద్రబాబుతో సమావేశమై శుభాకాంక్షలు చెబుతున్నారు. ఫలితాలు వచ్చిన రోజునే సీఎస్ జవహర్ రెడ్డి టీడీపీ అధినేతతో సమావేశమయ్యారు. మర్యాదకపూర్వకంగా సమావేశమై ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు.
ఇదే క్రమంలో చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లకు చంద్రబాబు షాక్ ఇచ్చారని సోషల్ మీడియాలో ఓ మెసేజ్ చక్కర్లు కొడుతోంది. పీఎస్‌ఆర్ ఆంజనేయులు, కొల్లి రఘురామిరెడ్డి తనను కలిసేందుకు ప్రయత్నించగా చంద్రబాబు నిరాకరించారని చెబుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్లిద్దరు టార్గెటెడ్‌గా టీడీపీ లీడర్లను ఇబ్బంది పెట్టారని ఎప్పటి నుంచో తెలుగుదేశం నేతలు ఆరోపిస్తూ వచ్చారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.