Pawan Kalyan Lead In Pithapuram | AP Elections Counting | తాను తాగ్గి..కూటమిని గెలిపించిన జనసేనాని
2024 ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ ఎవరైనా ఉన్నారా..? అంటే అది కచ్చితంగా పవన్ కల్యాణే. ఎందుకో తెలియాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి..!
175 సీట్లలో 151 జగన్ కే..! చంద్రబాబుకు వయసైపోతోంది. ఆయనను జైలులో పెట్టారు. లోకేశ్ దిల్లీ బాట పట్టారు. టీడీపీ క్యాడర్ అంతా నిరాశలో ఉంది. లోకేశ్ ఇంకా ఆ స్థాయిలో ఎస్టాబ్లిష్‌మెంట్ కాలేదు. గవర్నమెంట్ ఎంత నెగెటివిటీ ఉన్నా.. 60 సీట్లు తగ్గినా మరోసారి జగన్ దే అధికారం. వార్ వన్ సైడ్ అనుకుంటున్న తరుణంలో.. ఒక్కడు ఎంటరై కథ మొత్తం మార్చేశాడు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ శపథం చేసి... ఊపిరి ఆగుతున్న టీడీపీకి సంజీవనిలా.. బలమైన కూటమి ఏర్పాటు చేసే పరశురాముడిలా.. మార్పు కోరుకుంటున్న జనాలకు ఆశదీపంగా మారాడు. వ్యుహమెస్తే వ్యతిరేక ఓటు అంతా ఒక్కటైంది.
ఇప్పటి దాంకా.. నేను చెప్పిన మాటలన్నీ నా ఒక్కడిదే కాదు. 2024 ఎన్నికలను దగ్గర నుంచి చూసిన ప్రతివారి ఫీలింగ్ ఇదే. చంద్రబాబు వయసైపోతోంది. నారా లోకేశ్ యువగళంతో లీడర్ గా ఎదిగినప్పటికీ..జగన్ ఢీ కొట్టే స్థాయిలో ఎదగలేదు. ఈ సమయంలో.. అంగ, ఆర్థిక బలాన్ని పెంచుకుంటూ.. దిల్లీలో మోదీని అత్యంత సన్నిహితంగా మెలుగుతూ జగన్ మరింత బలంగా మారాడు. ఈ సమయంలో జగన్ ఢీ కొట్టి చంద్రబాబు గెలుస్తారు అన్న నమ్మకం సామాన్య జనాల్లోనే కాదు.. టీడీపీ కార్యకర్తల్లోనూ లేదు.