YS Jagan Arrest in Singayya Case | సింగయ్య మృతి కేసులో జగన్ అరెస్ట్
పల్నాడు పర్యటనలో వైఎస్ జగన్ కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనలో పోలీసులు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేసారు. ఈ కేసులో డ్రైవర్ రమణారెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు నాగేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి, విడుదల రజిని, పేర్ని నానిలపై కేసు నమోదు చేసారు పోలీసులు. ఇప్పటికే కార్ డ్రైవర్ ని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు పోలీసులు.
జగన్ పల్నాడు పర్యటనకు సంబందించిన వీడియోలు, ఫొటోలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అలాగే సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా మరింత సమాచారాన్ని సేకరిస్తారు పోలీసులు. ఈ ఘటనలో జగన్ ప్రయాణిస్తున్న కారు టైరు కింద పడిపొయ్యారు సింగయ్య. అక్కడే ఉన్న స్ఠానికులు గుర్తించి హాస్పిటల్ కి తరలించారు. అప్పటికే వృద్ధుడు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అతని భార్య చీలి లూర్ధు మేరీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 106(1) BNS సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టుగా గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.
జగన్ కారు కింద పడి సింగయ్య మృతి చెందినట్లుగా సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. ఈ వీడియోని వైఎస్ షర్మిల కూడా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసారు. కారు కింద ఎవరు పడ్డారో ఒంటి మీద సోయ లేకుండా కాన్వాయ్ ను కొనసాగించడం ఏమిటి.. ? అంటూ జగన్ పై విరుచుకుపడ్డారు షర్మిల.




















