Vizianagaram Car door Lock Tragedy | విజయనగరం జిల్లా ద్వారపూడిలో తీవ్ర విషాదం | ABP Desam
విజయనగరం జిల్లా ద్వార పూడిలో తీవ్ర విషాదం నెలకొంది. కారు డోర్ లాక్ పడి నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవటం అందరినీ కలచి వేస్తోంది. ఆదివారం ఉదయం ఆడుకోవటానికి బయటకు వెళ్లిన నలుగురు చిన్నారులు ఎంతకీ కనపడకపోవటంతో...ఉదయం నుంచి గ్రామం అంతా వెతికారు తల్లితండ్రులు. గ్రామంలోని మహిళా మండల కార్యాలయం వద్ద ఆగి ఉన్న కారును పరిశీలించగా అందులో నలుగురు చిన్నారులు అపస్మారక స్థితిలో కనిపించారు. కారులో సరదాగా కూర్చోవటానికి వెళ్లిన పిల్లలు డోర్ లాక్ పడిపోవటంతో ఊపిరి ఆడక చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. 8ఏళ్ల ఉదయ్, 8ఏళ్ల చారుమతి, ఆరేళ్ల ఛరిష్మా, ఆరేళ్ల మనస్విని ప్రాణాలు కోల్పోవటంతో వారి తల్లితండ్రుల వేదన వర్ణనాతీతం. ఘటన గురించి తెలుసుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆసుపత్రికి వచ్చి చిన్నారుల మృతదేహాలను పరిశీలించి తల్లితండ్రులకు ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి వాళ్లకు అవసరమైనంత మేర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.





















