Vennelavalasa Mystery Caves | శ్రీకాకుళం జిల్లాలో ఆదిమానవుల కాలం నాటి గుహలు.? | ABP Desam
కళింగ సీమ ఒకనాడు స్వర్ణయుగాన్ని అనుభవించిన బౌద్ధ సంస్కృతికి పట్టుగొమ్మ . ఆ నాడు బౌద్ధ వాజ్ఞ్మయానికి ప్రధాన కేంద్రం గా సరుబుజ్జిలి మండలం అంటారు. ఓ వైపు వెన్నెల వలస అక్కడికి కొద్ది దూరంలో దంతపురి విలసిల్లినది . కొన్ని శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకుంది . ఎంతో విలువైన , అపురూపమైన ప్రాచీన వారసత్వ సంపదకు దంతపురి సాక్షీభూతంగా నిలిచిన వెన్నెల వలస గృహాలను మాత్రం గుర్తు పట్టలేకపోతున్నారు. దీనికి ప్రధానంగా ముస్లింలు పరిపాలన సమయంలో దేశం మొత్తం చిన్నభిన్నం చేసేసారు. చిన్న చిన్న రాజ్యాల మీద ముస్లింలు దండయాత్రకి వచ్చి యుద్ధాన్ని ప్రకటించేవారనేది చరిత్ర చెబుతుంది. అందులో భాగంగానే వెన్నెల వలసలు ఈ చూస్తున్న గుహలు కూడా అప్పుట్లో వారి నుంచి కాపాడే ప్రయత్నంలో బాహ్య ప్రపంచానికి తెలియకుండా పోయిందని స్థానికులు కథలు కథలుగా చెబుతున్నారు. ఆదిమానవులు ఈ ప్రాంతంలో సంచరించి నివాసించేవారట. అక్కడ గుహలు ఉన్నాయని అప్పుడు రాజులకు తెలియడంతో ఒడిస్సాలోని కొంతమంది సామంత రాజులు ఈ ప్రాంతానికి వచ్చి తలదాచుకున్నారని చరిత్ర చెబుతుంది. ఈ రోజు వరకు ఆ ప్రాంతానికి ఎవరు అయితే వెళ్లలేదు మొదటిసారిగా మీ ఏబీపీ ఛానల్ వారు వెళుతున్నారు. టూరిజం శాఖలో సమాచారం ఉన్న వారు పట్టించుకోలేదు. టూరిజం శాఖ అధికారి నారాయణరావు మాత్ర ఏబీపీ వెళ్లి సాహోసేపేత నిర్ణయం తీసుకుందంటున్నారు. .





















