Tirupati Gangamma Jathara Viswaroopam | తిరుపతి గంగమ్మ జాతర ఆఖరి రోజు అమ్మవారి విశ్వరూపం | ABP Desam
రాయలసీమలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన తిరుపతి గంగమ్మజాతర ఆఖరి రోజు అమ్మవారి విశ్వరూపదర్శనం చేశారు. ఎనిమిది రోజుల పాటు రకరకాల వేషాల్లో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు..విశ్వరూపం దర్శనం చేసుకుని అమ్మవారి సేవలో తరించారు. తిరుమల శ్రీవారికి సాక్షాత్తూ... చెల్లెలుగా భావించే గంగమ్మ జాతర కోసం ఏటా తిరుమల నుంచి ఆడపడుచు లాంఛనాలతో సారె రావటం విశేషం. ఆఖరి రోజు విశ్వరూప దర్శనం తర్వాత అమ్మావారి చెంపనరుకుడు కార్యక్రమం మొదలైంది. అమ్మవారి బొమ్మను తయారు చేసిన మట్టిని పీకి భక్తులకు పంచిపెట్టారు. అమ్మవారి పుట్టమన్ను కోసం వేలాదిగా భక్తులు తరిలివచ్చారు. అమ్మవారి మట్టిని ప్రసాదంగా తీసుకుని ఇళ్లకు వెనుదిరిగారు. గంగమ్మ జాతరను రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తించిన తర్వాత యువతలో ఇంకా జోష్ పెరుగుతోంది. పుష్ప సినిమాలోనూ గంగ జాతర హైలెట్ కావటంతో ఇంకా ఎక్కువ మందికి అమ్మవారి జాతర గురించి తెలిసింది. కేవలం తిరుపతి, చిత్తూరు నుంచే కాకుండా సరిహద్దు ప్రాంతమైన తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు.





















