CM JAGAN: చిత్తూరు జిల్లా పర్యటనలో తన ఇల్లు ఇవ్వటం లేదని సీఎంకి ఓ మహిళ ఫిర్యాదు..!
రేణిగుంట మండలం వేదళ్ల చెరువులోని వరద ప్రభావిత ప్రాంతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించారు.వరద ప్రభావం కారణంగా నష్ట పోయిన వారి సమస్యలను సీఎం అడిగి తెలుసుకున్నారు.ఈక్రమంలో ఓ మహిళ స్ధానిక ప్రభుత్వ అధికారులపై సీఎం జగన్ కు ఫిర్యాదు చేశారు. తనకు రావాల్సిన ఇళ్ళ పట్టాను స్ధానిక విఆర్వో మరొకరికి కేటాయించి తమకు అన్యాయం చేశారని, ఇదే విషయంపై కలెక్టర్ ని కలిసినా తమకు న్యాయం జరగలేదని బాధితురాలు సీఎంకు తమ బాధను వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన సీఎం బాధితురాలికి తగిన న్యాయం చేయాలని అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. వరద బాధితులకు తగిన సౌకర్యాలు కల్పించడమే కాకుండా వారికి అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలని ఆదేశించారు.





















