Kurnool: కోడుమూరులో 'అమ్మో బొమ్మ'.. భయంతో జనం పరుగులు
కర్నూలు జిల్లా కోడుమూరులో క్షుద్రపూజల వార్త కలకలం రేపింది. గూడూరు రహదారిలో హెచ్ పి గ్యాస్ గోడౌన్ వెనుక గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన క్షుద్రపూజల ఆనవాలు కనిపించింది. రెండు మనిషి ఆకారపు బొమ్మలు తయారు చేసి వాటిని కుంకుమ పసుపు వేసిన రతి బొమ్మ మీద పీచు తీయని టెంకాయ వుంచి సాంబ్రాణి, అగర్ బత్తిలతో పూజ జరిపిన ఆనవాలు చూసి ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
మనుషులను లేక వ్యాపార లావాదేవీలు నాశనము చేయటానికి జరిగిన పూజలుగా ప్రజలు అనుమానిస్తున్నారు. మరికొందరు ఇవన్నీ మూఢనమ్మకాలని వాటిని పట్టించుకోనవసరం లేదంటున్నారు. కొందరు మంత్రగాళ్లు ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి ఇలాంటి పూజలు చేస్తున్నారని పోలీసులు వీరిపై దృష్టి పెట్టాలన్నారు.





















