Pawan Kalyan First Speech in Assembly: ఏపీ అసెంబ్లీలో పవన్ తొలి ప్రసంగం
Pawan Kalyan First Speech in Assembly: ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో తొలిసారిగా స్పీచ్ ఇచ్చారు. ఏపీ అసెంబ్లీగా ఏకగ్రీవంగా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడికి శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్...ఆ తర్వాత ఆయనపై ఛలోక్తులు విసురుతూ అసెంబ్లీలో నవ్వులు పూయించారు.
డిప్యూటీ సీఎం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ తొలిసారిగా అసెంబ్లీలో మాట్లాడారు. స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడు ఎన్నికైన వేళ పవన్ మాట్లాడారు. రిషికొండను గుండు కొట్టినట్టు ప్రత్యర్థులను విమర్శలతో గుండు కొట్టే సత్తా అయ్యన్నకు ఉంది. ఇకపై ప్రత్యర్థులను విమర్శించే అవకాశం ఆయనకు ఉండదు. కానీ అలా విమర్శలు చేసే వారిని వారించే బాధ్యత ఆయనకు ఉంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి స్పీకర్‌గా రావడం సంతోషంగా ఉందన్నారు పవన్ కల్యాణ్. ఓటమిని ధైర్యంగా స్వీకరించే దమ్ము వైసీపీకి లేదన్నారు. అందుకే సభ నుంచి పారిపోయారని ఎద్దేవా చేశారు. ఇన్ని దశాబ్దాల్లో ప్రజల అయ్యన్న పాత్రుడిలో వాడీవేడి చూశారు ఇన్నాళ్లూ ఘాటైన వాగ్దాటి చూశారని అన్నారు. నేటి నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూస్తారని అయ్యన్నను ఉద్దేశించి కామెంట్ చేశారు.