JC Prabhakar Reddy Counter to Jagan | జగన్ కు జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పై స్పందించిన జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చిన మున్సిపల్ చైర్మన్ చేసి ప్రభాకర్ రెడ్డి. పార్టీకి చెడ్డ పురుగు లాంటివాడు కేతిరెడ్డి అని అన్నారు ప్రభాకర్ రెడ్డి. పెద్దారెడ్డి విషయంలో నేను తగ్గను అని అన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరి ఇంటికి వెళ్లలేదే మాజీ ఎమ్మెల్యే ఎలా వచ్చాడు ? మీ తాత పెద్ద ఫ్యాక్షనిస్ట్ ఆయన ఎవరింటి వద్దకు వెళ్లలేదు. మీ తాత చనిపోయిన రోజు పులివెందుల మధ్యాహ్నం వరకు బాగుంది. కేతిరెడ్డి ఫ్యామిలీ పులివెందులలో అడుగుపెడితేనే బి.యన్.రెడ్డి ఇండ్లు కాల్చారు. జగన్ రెడ్డి నీకు గుర్తు లేకపోతే మీ అమ్మ గారిని అడుగు అని అన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఎక్కడైనా ఎన్ని కేసులు ఉంటాయా? నా పైన ఉన్నాయి అయినా నేను బాధపడలేదు. నువ్వు చదువుకున్న స్కూల్లోనే నేను చదువుకున్న ఆయన ఇప్పటికీ లైబ్రరీలో నా పేరు ఉంది. జగన్ రెడ్డి ఎప్పుడు ఇంపోర్టెడ్ కార్లలో తిరగలేదు.. ఆయన తిరగాలంటే తెప్పించుకునే శక్తి ఉంది అంటూ కామెంట్ చేసారు.





















