Cyclone Jawad: ద.మ.రైల్వే శాఖ రద్దు చేసిన రైలు సర్వీసులు ఇవే.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం, ఉత్తరాంధ్ర దిశగా కదులుతోంది. నేడు తీవ్ర వాయుగుండంగా, అనంతరం తుపానుగా బలపడనుంది.వాయుగుండం విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 960 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 1,020 కిమీ దూరంలో కేంద్రీకృతమైంది.సాయంత్రం నుంచే భారీ నుంచి అతి భారీ వర్షాలతోపాటు గంటకు సుమారు 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం వుంది.తుపాను ప్రభావంతో నేడు బయలుదేరే పలు రైళ్లను ద.మ.రైల్వే రద్దు చేసినట్లు డివిజనల్ రైల్వే అధికారి తెలిపారు. నేటి నుండి ప్రారంభమయ్యే హౌరా-సికింద్రాబాద్ మధ్య నడిచే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్(12703), సికింద్రాబాద్-హౌరా మధ్య నడిచే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్(12704), సికింద్రాబాద్-భువనేశ్వర్ మధ్య నడిచే విశాఖ ఎక్స్‌ప్రెస్(17016), భువనేశ్వర్-సికింద్రాబాద్ మధ్య నడిచే విశాఖ ఎక్స్‌ప్రెస్(17015) రైళ్లను నిలిపివేసినట్లు తెలిపారు.