BJP MLA Comments on YSRCP | బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు
BJP MLA Comments on YSRCP: బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు | ABP Desam కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్సీపీ విలీనం అయిపోతుందని బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారో ఈ వీడియోలో చూడండి.
వైసీపీ మద్దతు ఓంబిర్లాకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీతో రాజకీయంగా గొడవలు పెట్టుకునే పరిస్థితి వైసీపీకి ఉండదు. గత ఐదేళ్లలో అధికారంలో ఉన్నప్పటికీ అదే పంథాను అనుసరించారు. ఇప్పుడు అధికారం కోల్పోయినా.. అదే పంథా పాటించే అవకాశాలు ఉన్నాయి. ఒక వేళ ఓం బిర్లా అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తే వైసీపీ ఇండియా కూటమికి దగ్గర అవుతుందని బీజేపీ అనుమానిస్తుంది. అది వైసీపీకి కొత్త సమస్యలు సృష్టిస్తుంది. అందుకే వీలైనంత వరకూ స్పీకర్ ఎన్నిక విషయంలో సైలెంట్ గా బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ఓటేసి వచ్చే అఅవకాశాలు ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.