అన్వేషించండి
Visaka Lands: దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ పై ఇసుక చల్లిన అసిస్టెంట్ కమిషనర్
విశాఖ జిల్లా దేవాదాయ శాఖ కార్యాలయంలో అధికారుల మధ్య వివాదం చెలరేగింది. డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్ పై అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇసుక చల్లారు. పుష్పవర్ధన్ కొంతకాలం కిందటే.. తెలంగాణ నుంచి ఏపీకి బదిలీపై వచ్చారు. విశాఖ జిల్లాలో దేవాదాయశాఖ పరిధిలో అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియపై విచారణ చేపట్టారు. అయితే ఈ విషయంపై కిందిస్థాయి సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల ఉదాసీనతను పుష్పవర్ధన్ ప్రశ్నించడంతోనే ఈ వివాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పుష్ప వర్ధన్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కార్యాలయానికి విజిలెన్స్ సిబ్బంది చేరుకుని ఈ వ్యవహారంపై విచారణ చేపట్టారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్





















