Ananthapuram Police : అనంతపూర్ లో అంతర్రాష్ట్ర దొంగలముఠా అరెస్ట్
తాళం వేసి వెళ్లిన ఇళ్లే కాదు....ఒంటరిగా వున్న మహిళలు...పక్కా స్కెచ్ వేసి దొంగతనాలు చేయడం వారికి అలవాటు.ఇక్కడే కాదు పక్కనే వున్న Telangana, Karnatakaలో కూడా వారు రికార్డు స్థాయిలో దొంగతనాలు చేశారు.వారిని పట్టుకోవడం పోలీసులకు సవాల్ గా మారింది.అందరూ కూడా Hindupuram వాసులే.ఇటీవల కాలంలో మడకశిరలో ఒక దొంగతనం జరిగింది.ఆ కేసులో అనుమానితులు కూడా వీరే కావడంతో పోలీసులు సీరియస్ గా రంగంలోకి దిగారు. నిందితుల భందువులను అదుపులోకి తీసుకోవడంతో పోలీసులకు దొరికిపోయారు నిందితులు.ఆరుమంది సభ్యుల ముఠాను మడకశిర CI అరెస్ట్ చేసి భారీ స్థాయిలో రికవరీ చేసినట్లు అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప వెల్లడించారు.955 గ్రాముల బంగారం,రెండు కేజీల వెండి ఆభరణాలతో సహా,మూడు టూవీలర్లను రికవరీ చేసినట్లు SP వెల్లడించారు.





















