అన్వేషించండి
CM Jagan Meeting With MLA : ఈనెల 19 న వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్ సమావేశం | ABP Desam
ఈనెల 19 న వైసీపీ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి జగన్ సమావేశం కానున్నారు.ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో శాసన సభ్యులు అంతా అందుబాటులో ఉంటారని భావిస్తున్నారు.ఇక నియోజకవర్గ ఇంచార్జ్ లకు కూడ సమాచారం అందింది.175 నియోజక వర్గాల వైసీపీ ఎమ్మెల్యేల, వైసీపీ నియోజక వర్గ సమన్వయకర్త ల పనితీరు పై సీఎం జగన్ మోహన్ రెడ్డికి పీకే టీం నుండి నివేదిక అందిందని చెబుతున్నారు. పీకే టీమ్ నివేదిక ప్రకారం ఇటీవల కొందరి మంత్రుల పై జగన్ సీరియస్ అయ్యిన విషయం తెలిసిందే..దీంతో ఇప్పుడు జరుగుతున్న శాసన సభ్యుల సమావేశం పై కూడ ఉత్కంఠత నెలకొంది
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
తెలంగాణ
శుభసమయం





















