West Godavari : పెళ్లి కోసం రోడ్డు వేశారు.. ఇప్పుడు ఇదే పశ్చిమగోదావరి జిల్లాలో హాట్ టాపిక్
రెండేళ్లుగా గోతులతో తీవ్ర అధ్వానంగా మారిన రహదారి కారణంగా కుమారుడి పెండ్లి వేడుకకు వచ్చేవారు ఇబ్బంది పడతారని భావించిన న ఓ వ్యక్తి రూ. లక్షలు వెచ్చించి మరమత్తులు చేయించాడు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం కొత్త నవరసపురం నుంచి ఎలమంచిలి మండలం మేడపాడు కు వెళ్లే ఆర్ అండ్ బి ప్రధాన రహదారి సుమారు 15 కిలోమీటర్ల పరిధి విస్తరించి ఉంది. సగానికి పైగా దూరంలో పెద్ద పెద్ద గోతులు పడి దారుణంగా తయారయింది. ఇటుగా నరసాపురం మండలంలోని పలు గ్రామాల వారితో పాటు సమీపంలోని తూర్పుగోదావరి జిల్లా వాసులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఇదిలా ఉంటే కొత్త నవరసపురం గ్రామానికి చెందిన చిందాడి నిరీక్షణ రావు కుమారుడి వివాహం ఇటీవల జరిగింది. ఈ వేడుకకు వచ్చేవారికి ఇబ్బంది అవుతుందని భావించిన నిరీక్షణ రావు తన సొంత నిధులు రూ.రెండు లక్షలు వెచ్చించి కొత్త నవరసపురం గ్రామ పరిధి వరకు పడిన గోతులను పూడిపించి ఇబ్బందులు కొంతమేరకు తీర్చారు