‘జీలాండియా’, 375 ఏళ్ల కిందటే కనిపెట్టిన ఈ 8వ ఖండంపై మనుషులు నివసించవచ్చా?
మీకు తెలుసా? మన భూమిపై ఖండాలు ఏడు కాదు ఎనిమిదో. 8వ ఖండం న్యూజిలాండ్‌కు సమీపంలో ఉంది. దాన్నే ‘జీలాండియా’ అని అంటారు.
మన భూగ్రహంపై ఖండాల గురించి మీరు స్కూల్‌లో చదివే ఉంటారు. మహా సముద్రాలచే వేరు చేయబడిన పెద్ద భూభాగాలనే ఖండాలని అంటారు. భూమిపై మొత్తం ఏడు ఖండాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. అయితే, పరిశోధకులు మాత్రం ఏడు కాదు.. మొత్తం ఎనిమిది ఉన్నాయని అంటారు. ఈ వాదన బలపరిచేందుకు ఇప్పటివరకు ఎన్నో పరిశోధనలు కూడా జరిగాయి. వాస్తవానికి 1642లోనే ఎనిమిదో ఖండాన్ని కనుగొన్నారు. 2017లో భూవిజ్ఞాన శాస్త్రవేత్తల బృందం అధికారికంగా ఈ ఖండం గురించి తెలుసుకున్నారు. దీనికి ‘జీలాండియా’ని పేరు పెట్టారు.
మూడు శతాబ్దాల కిందటే డచ్ నావికుడు అబెల్ టాస్మాన్ దక్షిణ అర్ధగోళంలో ఒక విస్తారమైన ఖండం ఉందని తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన 1642, ఆగస్ట్ 14న ఇండోనేషియాలోని జకార్తా నుంచి బయలుదేరి, ఆ ఖండాన్ని కనుగొనేందుకు ప్రయత్నించాడు. చివరికి టాస్మాన్ న్యూజిలాండ్‌లోని దక్షిణ ద్వీపానికి వెళ్లారు. కానీ, ఆయన ప్రయాణం సజావుగా సాగలేదు. ‘BBC’ కథనం ప్రకారం.. అక్కడ నివసించే మావోరీ ప్రజల నుంచి టాస్మాన్ సవాళ్లు ఎదుర్కొన్నాడని తెలిసింది. వారు టాస్మాన్‌కు సాయం కోసం ఏర్పాటు చేసిన రెండు నౌకల మధ్య సందేశాలను అందించేందుకు ఉపయోగిస్తున్న చిన్న పడవను ముంచేశారు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారట. దీంతో టాస్మాన్ ఆ ప్రదేశాన్ని మూర్డెనర్స్ (హంతుకులు నివసించే తీర ప్రాంతం) అని పేరు పెట్టాడు. అదే ఇప్పుడు.. మన పరిశోధకులు కనుగొన్న ‘జీలాండియా’ ఖండం.
2017లో పరిశోధకుల నివేదిక ప్రకారం.. ఈ ఖండం మడగాస్కర్ కంటే ఆరు రెట్లు ఎక్కువ పరిమాణంలో ఉంది. ప్రపంచంలో విస్తీర్ణపరంగా అతి చిన్న ఖండం ‘ఆస్ట్రేలియా’. ఇప్పుడు ‘జీలాండియా’ ప్రపంచంలోనే అతి చిన్న, సన్నని, అతి పిన్న వయస్సు గల ఖండంగా మారింది. అయితే, జీలాండియాలో 94 శాతం భూభాగం ఇంకా నీటి అడుగునే ఉంది. అందుకే, దీన్ని 8వ ఖండంగా ప్రకటించినా.. ఎవరూ అంత సీరియస్‌గా తీసుకోవడం లేదు. కారణం, ఇంకా దీనిపై ఇంకా స్పష్టత రాకపోవడమే.
Also Read: ఈ నగరాల్లో నివసిస్తున్నారా? మీరు ఎంత సెక్స్ చేసినా ‘ఆ ఫలితం’ ఉండదు, కారణం ఇదే!
జిలాండియాలో న్యూజిలాండ్‌తో సహా తక్కువ సంఖ్యలో ద్వీపాలు మాత్రమే బయటకు కనిపిస్తున్నాయి. 94 శాతం ఆకట్టుకునే నీటి అడుగున ఉంది. ఈ ఖండం ఎంత మేరకు విస్తరించిందనేది పూర్తిగా తెలియరాలేదు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు 2,500 మీటర్ల రాక్ శాంపిల్స్, అవక్షేపాలను పరిశోధిస్తున్నారు. హ్యూస్టన్‌లోని రైస్ యూనివర్శిటీ ఎక్స్‌పెడిషన్ కో-చీఫ్ సైంటిస్ట్ గెరాల్డ్ డికెన్స్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు 8,000 కంటే ఎక్కువ నమూనాలను అధ్యయనం చేశామని తెలిపారు. ఈ సందర్భంగా వందల శిలాజ జాతులను గుర్తించామన్నారు. గతంలో ఈ ఖండంలో నివసించి మొక్కల జాతులు, వాతావరణం భిన్నంగా ఉండేవని గుర్తించామని తెలిపారు. అయితే, ఈ జీలాండియాలో ప్రజలు నివసించడం లేదు. ఈ ఖండానికి సమీపంలో ఉన్న న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఫిజీలు కూడా ఈ ఖండంలో భాగం కావని సూచించారు. మిగిలిన 6 శాతం భూభాగంలో పక్షులు, జలచరాలు మినహా ఇతరాత్ర జీవులేవీ భారీ సంఖ్యలో లేనట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఈ ఖండం పసిఫిక్ మహా సముద్రంలో ఉంది.