X

Video: తాగేసి ఫ్లైట్ లో నానా హంగామా.. భరించలేక సీటుకే కట్టేశారు!

ఓ యువకుడు తాగేసి ఫ్లైట్ లో నానా హంగామా సృష్టించాడు. తోటి ప్రయాణికులపై చేయి చేసుకున్నాడు. ఆ యువకుడ్ని సిబ్బంది సీటుకే కట్టేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

FOLLOW US: 

ఓ యువకుడు తాగేసి విమానంలో నానా హంగామా సృష్టించాడు. తోటి ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించాడు. ఒకరిపై చేయిచేసుకున్నాడు. ఇంక చేసేదేమీ లేక విమాన సిబ్బంది ఆ యువకుడ్ని సీటుకే కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసేశారు! విమానం ల్యాండ్ అయిన వెంటనే ఆ యువకుడ్ని పోలీసులకు అప్పజెప్పారు. అసలేం జరిగిందంటే?

ఏం జరిగింది?

ఫిలడెల్ఫియా నుంచి మియామి వెళ్తున్న ఓ విమానంలో మేక్స్ వెల్ బెర్రీ అనే 22 ఏళ్ల యువకుడు వీరంగం సృష్టించాడు. ఫుల్లుగా తాగేసి తోటి ప్రయాణికులతో దుర్భాషలాడాడు. అడ్డువచ్చినవారిని తోసేసి, ఒకరిని కొట్టాడు. ఎంత ప్రయత్నించినా ఆగకపోయేసరికి విమాన సిబ్బంది ఆ కుర్రాడ్ని తోటి ప్రయాణికుల సాయంతో సీటుకు ప్లాస్టర్ తో కట్టేశారు. విమానం దిగిన వెంటనే స్థానిక పోలీసులు ఆ కుర్రాడ్ని అదుపులోకి తీసుకున్నారు. మేక్స్ వెల్ 'హెల్ప్ మీ, హెల్ప్ మీ' అంటూ అరుస్తున్న ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతుంది. 

ఇలాంటి సంఘటనే..

కొన్నేళ్ల క్రితం భారత్ లోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు చాలా నీచంగా ప్రవర్తించాడు. ప్రయాణంలో ఉండగానే బాత్రూమ్‌లోకి వెళ్లి అక్కడ దుస్తులు మొత్తం విప్పేసి నానా హంగామా సృష్టించాడు. తొలుత విమానం ఎక్కి సీటులో కూర్చోగానే తనకు సీటుబెల్టు కట్టుకోవడం ఎలాగో తెలియదని వాదించాడు.

దాంతో విమాన సిబ్బంది ఆ విషయంలో అతడికి సాయం చేశారు. తర్వాత ఆ కుర్రాడు బాత్రూంకు వెళ్లి.. అక్కడ ఉన్న కాల్ బెల్ కొట్టి, సాయం కావాలని సిబ్బందిని పిలిచాడు. వెంటనే సిబ్బంది అక్కడకు వెళ్లి చూడగా.. అతడు దుస్తులన్నీ విప్పేసి అభ్యంతరకర పరిస్థితిలో కనిపించాడు.

ఇది చూసి లోపలికి వెళ్లేందుకు మహిళా సిబ్బంది నిరాకరించారు. ఆ తర్వాత ఎలాగోలా బయటకు వచ్చేశాడు. ఆపై కూడా తన ప్రవర్తన మానుకోలేదు. ప్రయాణికులంతా విమానం నుంచి దిగేటప్పుడు మహిళా సిబ్బందిపై దుర్భాషలాడాడు. విమాన కెప్టెన్‌కు సిబ్బంది ఈ విషయం వెల్లడించగా, కెప్టెన్ వెంటనే దిల్లీలోని భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. సదరు ప్రయాణికుడు కిందకు దిగగానే పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అతడిపై దిల్లీలోని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ వార్త అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది.

ALSO READ:

Covid 19 India Update: దేశంలో కొత్తగా 42,982 కేసులు, 533 మరణాలు

Tags: Drunk passenger Viral video Flight video Drunken man in Flight

సంబంధిత కథనాలు

Breastfeed: విమానంలో పిల్లి పిల్లకు రొమ్ము పాలిచ్చిన మహిళ.. ప్రయాణికులు షాక్

Breastfeed: విమానంలో పిల్లి పిల్లకు రొమ్ము పాలిచ్చిన మహిళ.. ప్రయాణికులు షాక్

Love Story : లవర్ ఆఫ్ ది డికేడ్ .. 40 ఏళ్లకుపైగా నిరీక్షించి ప్రేయసిని పెళ్లాడిన ప్రేమికుడు..!

Love Story :  లవర్ ఆఫ్ ది డికేడ్ ..  40 ఏళ్లకుపైగా  నిరీక్షించి ప్రేయసిని పెళ్లాడిన ప్రేమికుడు..!

Satya Nadella: మైక్రోసాఫ్ట్‌లో తన పేరిట ఉన్న సగం షేర్లు అమ్మేసిన సత్య నాదెళ్ల.. ఎందుకంటే..

Satya Nadella: మైక్రోసాఫ్ట్‌లో తన పేరిట ఉన్న సగం షేర్లు అమ్మేసిన సత్య నాదెళ్ల.. ఎందుకంటే..

రోబో ‘చిట్టీ’ ఇక మీ రూపంలో.. దీనికి అంగీకరిస్తే రూ.2 కోట్లు మీవే!

రోబో ‘చిట్టీ’ ఇక మీ రూపంలో.. దీనికి అంగీకరిస్తే రూ.2 కోట్లు మీవే!

The Uncle North Korea: ‘ది అంకుల్’ సినిమా చూశాడని బాలుడి అరెస్ట్.. 14 ఏళ్లు జైలు శిక్ష

The Uncle North Korea: ‘ది అంకుల్’ సినిమా చూశాడని బాలుడి అరెస్ట్.. 14 ఏళ్లు జైలు శిక్ష
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Srikanth Kidambi: గత మూడువారాల్లో ఎంతో నేర్చుకున్నా.. తర్వాతి లక్ష్యం అదే :కిడాంబి శ్రీకాంత్

Srikanth Kidambi: గత మూడువారాల్లో ఎంతో నేర్చుకున్నా.. తర్వాతి లక్ష్యం అదే :కిడాంబి శ్రీకాంత్

Samsung A73: శాంసంగ్ కొత్త 5జీ మొబైల్ వచ్చేస్తుంది.. 108 మెగాపిక్సెల్ కెమెరా కూడా!

Samsung A73: శాంసంగ్ కొత్త 5జీ మొబైల్ వచ్చేస్తుంది.. 108 మెగాపిక్సెల్ కెమెరా కూడా!

Jawad Cyclone: విశాఖకు 770 కి.మీటర్ల దూరంలో తుపాను... రేపు ఉదయం ఉత్తరాంధ్ర-ఒడిశా మధ్య తీరం దాటొచ్చు... ఏపీ విపత్తు నిర్వహణశాఖ ప్రకటన

Jawad Cyclone: విశాఖకు 770 కి.మీటర్ల దూరంలో తుపాను... రేపు ఉదయం ఉత్తరాంధ్ర-ఒడిశా మధ్య తీరం దాటొచ్చు... ఏపీ విపత్తు నిర్వహణశాఖ ప్రకటన

Govt FAQs on Omicron: ఒమిక్రాన్‌ వల్ల థర్డ్ వేవ్ వస్తుందా? టీకాలు పనిచేస్తాయా? ఇదిగో సమాధానాలు

Govt FAQs on Omicron: ఒమిక్రాన్‌ వల్ల థర్డ్ వేవ్ వస్తుందా? టీకాలు పనిచేస్తాయా? ఇదిగో సమాధానాలు