News
News
వీడియోలు ఆటలు
X

Covid 19 India Update: దేశంలో కొత్తగా 42,982 కేసులు, 533 మరణాలు

దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,11,076కి పెరిగింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 1.29%గా ఉంది. వీక్లీ పాజిటివ్ రేటు 5% లోపే ఉంది.

FOLLOW US: 
Share:

దేశంలో కొత్తగా 42,982 కేసులు నమోదుకాగా 533 మంది మరణించారు. 41,726 మంది వైరస్ నుంచి రికవరయ్యారు. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4,11,076కి పెరిగింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 1.29%గా ఉంది. వీక్లీ పాజిటివ్ రేటు 2.37%గా ఉంది.

  1. మొత్తం కేసులు: 3,18,12,114
  2. యాక్టివ్ కేసులు: 4,11,076
  3. మొత్తం రికవరీలు: 3,09,74,748
  4. మొత్తం మరణాలు: 4,26,290
  5. మొత్తం వ్యాక్సినేషన్: 48,93,42,295

కేరళలో మళ్లీ 20 వేలకు పైనే..

కేరళలో లాక్ డౌన్ ఆంక్షలు సడలిస్తూ నిన్న కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది విజయన్ సర్కార్. కొత్తగా 22,414 కేసులు నమోదయ్యాయి. 108 మంది కరోనాతో మృతి చెందారు. 

  • మొత్తం యాక్టివ్ కేసులు: 1,76,048
  • మొత్తం మరణాలు: 17,211

మార్గదర్శకాలు..

  • దుకాణాలు, మార్కెట్లు, బ్యాంకులు, కార్యాలయాలు, పరిశ్రమలు, పర్యటక ప్రాంతాలు సోమవారం నుంచి శనివారం వరకు తమ కార్యకలాపాలు నడపొచ్చు.
  • పబ్లిక్ సెక్టార్ రంగంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, పీఎస్ యూలు, కంపెనీలు, స్వయంప్రతిపత్తి సంస్థలు, కమిషన్లు సోమవారం నుంచి శుక్రవారం వరకు పనిచేయనున్నాయి.
  • రెండు వారాలకు ముందు కొవిడ్ వ్యాక్సిన్ ఒక డోసు అయిన తీసుకున్నవారు, 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగెటివ్ వచ్చినవారు, కొవిడ్ తగ్గి నెల రోజులు పూర్తయిన వారికి మాత్రమే దుకాణాలు, మార్కెట్లు, బ్యాంకులు, పబ్లిక్, ప్రైవేట్ కార్యాలయాలు, పరిశ్రమల్లో పనిచేయడానికి, అడుగుపెట్టడానికి అర్హత ఉంది. 
  • దుకాణాలు, పర్యటక ప్రాంతాలు సహా ఇతర సంస్థలు తమ కార్యాలయాల ముందు ఉద్యోగుల వ్యాక్సినేషన్ వివరాలు కనిపించేలా ప్రదర్శించాలి.
  • వినియోగదారులు అందర్నీ ఒకేసారి అనుమతించకుండా సమయానుకూలంగా సేవలు అందించాలి. వినియోగదారులు భౌతిక దూరం పాటించకపోతే దానికి పూర్తి బాధ్యత యజమానులదే. మార్గదర్శకాలు పాటిస్తున్నారా లేదా అని తరచూ చెకింగ్ బృందాలు పరీక్షిస్తాయి.
  • ఆగస్చు 8 (ఆదివారం) పూర్తి లాక్ డౌన్ అమలులో ఉంటుంది. ఆగస్టు 15( స్వాతంత్య్ర దినోత్సవం)న మాత్రం ఎలాంటి లాక్ డౌన్ లేదు.
  • పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేట్ సెంటర్లు, సినిమా థియేటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లలో డైనింగ్లపై నిషేధం.
  • ఆన్ లైన్ డెలివరీ కోసం మాత్రమే మాల్స్ ఓపెన్ చేయాలి. విద్యాసంస్థలు కూడా ఆన్ లైన్ క్లాసుల నిర్వహణ కోసం మాత్రమే తెరవాలి.
  • సాంస్కృతిక, రాజకీయ బహిరంగ సభలకు ఎలాంటి అనుమతి లేదు. పెళ్లి, ఫంక్షన్లలో 20 మంది కంటే ఎక్కువ మంది పాల్గొనకూడదు.

మహారాష్ట్రలో..

మహారాష్ట్రలో కొత్తగా 6,126 కరోనా కేసులు నమోదుకాగా 195 మంది మృతి చెందారు. 7,436 మంది కరోనా నుంచి రికవరయ్యారు. 

  • మొత్తం కేసులు: 63,27,194
  • మొత్తం మరణాలు: 1,33,410
  • మొత్తం రికవరీలు: 61,17,560

దిల్లీలో..

దిల్లీలో కొత్తగా 67 కేసులు నమోదుకాగా ఒక్కరు కూడా మరణించలేదు. పాజిటివిటీ రేటు 0.09%గా ఉంది. దిల్లీలో ఒక రోజులో ఎలాంటి కరోనా మరణాలు నమోదుకాకపోవడం సెకండ్ వేవ్ లో ఇది ఐదోసారి. 

Published at : 05 Aug 2021 11:12 AM (IST) Tags: coronavirus COVID-19 Corona Deaths corona cases Covid Tally

సంబంధిత కథనాలు

ఆ ‘ఐ డ్రాప్స్’తో పిల్లల్లోని దృష్టి లోపాన్ని నివారించవచ్చట - తాజా పరిశోధనలో వెల్లడి

ఆ ‘ఐ డ్రాప్స్’తో పిల్లల్లోని దృష్టి లోపాన్ని నివారించవచ్చట - తాజా పరిశోధనలో వెల్లడి

Salt: ఉప్పు తగ్గించండి, కానీ పూర్తిగా తినడం మానేయకండి - మానేస్తే ఈ సమస్యలు తప్పవు

Salt: ఉప్పు తగ్గించండి, కానీ పూర్తిగా తినడం మానేయకండి - మానేస్తే ఈ సమస్యలు తప్పవు

World Brain Tumor Day 2023: మెదడులో కణితులు త్వరగా గుర్తిస్తే చికిత్స చేయడం సులభమే, లక్షణాలు ఇవిగో

World Brain Tumor Day 2023: మెదడులో కణితులు త్వరగా గుర్తిస్తే చికిత్స చేయడం సులభమే, లక్షణాలు ఇవిగో

Ghee: ఈ సమస్యలు ఉంటే నెయ్యి తినడం తగ్గించాల్సిందే

Ghee: ఈ సమస్యలు ఉంటే నెయ్యి తినడం తగ్గించాల్సిందే

Skin Glow: చర్మం మెరిసిపోవాలంటే రోజూ తినాల్సిన ఆహారాలు ఇవిగో

Skin Glow: చర్మం మెరిసిపోవాలంటే రోజూ తినాల్సిన ఆహారాలు ఇవిగో

టాప్ స్టోరీస్

Lokesh Rayalaseema Declaration : రాయలసీమ అభివృద్ధికి టీడీపీ డిక్లరేషన్ - అవన్నీ చేస్తే రత్నాల సీమే !

Lokesh Rayalaseema Declaration :  రాయలసీమ అభివృద్ధికి టీడీపీ డిక్లరేషన్ - అవన్నీ చేస్తే  రత్నాల సీమే !

YS Viveka Case : వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి

YS Viveka Case :  వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!

Noise Buds Trance: రూ. వేయి లోపే ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ - లాంచ్ చేసిన ఇండియన్ బ్రాండ్ నాయిస్!

Noise Buds Trance: రూ. వేయి లోపే ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ - లాంచ్ చేసిన ఇండియన్ బ్రాండ్ నాయిస్!