Bank Card Chip In Hand: చేతిలో చిప్.. ఇక మీ చెయ్యే ఏటీఎం కార్డు, చర్మంలోనే అమర్చేస్తారట!
మీరు ఇక ఏటీఎం కార్డు, డెబిట్ కార్డులను మరిచిపోయినా పర్వాలేదు. ఎందుకంటే, బ్యాంక్ కార్డు చిప్‌లను మీ చర్మంలోనే అమర్చేస్తారట. ఇదిగో ఇలా..
షాపింగ్ వెళ్లినప్పుడో, ఏదైనా ముఖ్యమైన పని మీదో బయటకు వెళ్లేప్పుడు ఏటీఎం లేదా క్రెడిట్ కార్డును తీసుకెళ్లడం మరిచిపోతాం. లేదా కార్డు ఇచ్చి మరిచిపోతుంటాం. అయితే, భవిష్యత్తులో మీకు ఆ సమస్య ఉండదు. ఎందుకంటే.. త్వరలో ఏటీఎం, డెబిట్ కార్డుల్లో పెట్టే చిప్‌లను మన శరీరంలోనే పెట్టేస్తారట. చేతి చర్మంలో ఈ చిప్‌ను అమర్చేస్తారట. వినేందుకు చిత్రంగానే ఉన్నా.. ఇది నమ్మలేని నిజం. ఇప్పటికే దీనికి ప్రయత్నాలు కూడా మొదలైపోయాయి.
ప్రపంచంలో మానవుల శరీరంలో అమర్చగల బ్యాంక్ కార్డ్ చిప్‌లను తయారు చేసిన మొట్టమొదటి సంస్థ తమదేనని బ్రిటన్‌కు చెందిన పారిశ్రామికవేత్త, వాలెట్‌మోర్(Walletmor) వ్యవస్థాపకుడు వోజ్టెక్ పప్రోటా వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాలను ఆ సంస్థ ఇటీవల లింక్డ్‌ఇన్‌లో పేర్కొంది. బ్యాంక్ కార్డ్ చిప్‌లను చేతిలోనే అమర్చుతామని వెల్లడించింది. ఈ ఇంప్లాంట్ ధర జస్ట్ రూ.16 వేలు మాత్రమేనట. దీన్ని మూడు దశల్లో అమర్చుతారట.
ముందుగా కస్టమర్ iCard అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇది ‘వాలెట్‌మోర్ ఇంప్లాంట్’కి లింక్ చేసే డిజిటల్ వాలెట్. అందులో మీ ఖాతా వివరాలను నమోదు చేయాలి. iCard యాప్ ద్వారా వారి ఇంప్లాంట్‌ని యాక్టివేట్ చేస్తే చాలు.. కార్డు లావాదేవీలకు సిద్ధమవుతుంది. ఆ తర్వాత దాన్ని శరీరంలో అమర్చడం కోసం క్లినిక్‌లో అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఇప్పటికే కొందరు ఈ చిప్‌ను తమ చేతిలో అమర్చుకున్నారట. వారి నుంచి పాజిటివ్ రివ్యూలు కూడా వస్తున్నాయి.
Also Read: ప్రియురాలి చనుబాలు, పచ్చిమాంసం - ఇవే ఇతడి హెల్త్ సీక్రెట్
ఈ ఇంప్లాంట్‌ను చేతిలో ఎక్కడైనా సరే అమర్చవచ్చు. మోచేయి, మణికట్టులో కూడా పెట్టవచ్చు. అయితే, మీరు వాచ్, ఆభరణాలు ధరించే ప్రదేశంలో మాత్రం చిప్‌ను ఇంజెక్ట్ చేయకూడదని సంస్థ పేర్కొంది. Walletmor వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. “వాలెట్‌మోర్ ఇంప్లాంట్‌ను శరీరంలోకి ఇంజెక్ట్ చేయడం చాలా సులభం. కానీ, ఈ స్వయంగా మాత్రం చేసుకోకూడదు. కేవలం సర్జన్ మాత్రమే దాన్ని అమర్చాలి. మేం పేర్కొన్న వివరాల ప్రకారమే వాటిని కస్టమర్ శరీరంలో ఇంప్లాంట్ చేస్తారు. ఇది ఇండియాకు రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఈ చిప్ మీ వెంట ఉంటే బ్యాంక్ మీ చేతిలో ఉన్నట్లే. ఫోన్లు, పర్సులతో పనే ఉండదు.
Also Read: పిల్లులను పెంచితే ‘బెడ్ రూమ్’లో రెచ్చిపోతారట, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
View this post on Instagram